మంగళవారం 20 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 27, 2020 , 07:02:43

వాగు దాటుతూ వ్యక్తి గల్లంతు

వాగు దాటుతూ వ్యక్తి గల్లంతు

హన్వాడ : వాగు దాటే క్రమంలో వ్యక్తి గల్లంతైన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల సమీపంలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. గొండ్యాలకు చెందిన కావలి రాములు (55) శనివారం మధ్యాహ్నం గ్రామంలోకి వచ్చే క్రమంలో ఉధృతంగా పారుతున్న వాగును దాటేందుకు యత్నించాడు. అయితే వాగు మధ్యలోకి వెళ్లగానే ప్రవాహ ఉధృతి ఎక్కువ కావడంతో అందరూ చూస్తుండగానే ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అదనపు కలెక్టర్‌ తేజస్‌ నండ్లాల్‌, మండల ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, ఎంపీపీ బాల్‌రాజు, ఎంపీడీవో నటరాజు వాగు వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. 


logo