బుధవారం 21 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 25, 2020 , 06:03:09

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' అంబులెన్స్‌ ప్రారంభం

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' అంబులెన్స్‌ ప్రారంభం

నారాయణపేట: మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' పిలుపు మేరకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రూ.20.50 లక్షలతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ను గురువారం మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేదలకు అధునాతన వసతులతో కూడిన అంబులెన్స్‌ ద్వారా అత్యవసరమైన సమయంలో సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అంబులెన్స్‌ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, అంబులెన్స్‌లో కొవిడ్‌ పరీక్షలు కూడా నిర్వహిస్తారని తెలిపారు.logo