బుధవారం 28 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 25, 2020 , 05:56:32

ఆడబిడ్డల పెండ్లిళ్ల్లకు ఆర్థిక సాయం

ఆడబిడ్డల పెండ్లిళ్ల్లకు ఆర్థిక సాయం

  • నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

  నారాయణపేట : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా వ్యవహరిస్తూ కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన 253 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌  చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా 116ల ఆర్థిక సాయం అందిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఇంత వరకు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు సాయం చేయలేదని గుర్తు చేశారు. అమ్మాయిల పెండ్లి చేయాలంటే పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతాయని, వీటిని గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఈ బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పథకం కింద చెక్కుల కోసం రెవెన్యూ శాఖ అధికారులు ఏ ఒక్క లబ్ధిదారుడి కూడా ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలు లేవన్నారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లెక్కచేయకుండా హెల్త్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖలు విధులు నిర్వహిస్తున్నాయని అభినందించారు. 249 మంది రైతులకు పాసుపుస్తకాలు తయారు చేసినట్లు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజగౌడ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసులు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సురేఖ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాసులు, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 


logo