బుధవారం 21 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 25, 2020 , 05:56:35

రిజిస్ట్రేషన్లకు సమస్యలు తలెత్తొద్దు

రిజిస్ట్రేషన్లకు సమస్యలు తలెత్తొద్దు

  • తాసిల్దార్‌ కార్యాలయాల్లో వసతుల కల్పించండి
  • పాఠశాల ఆవరణల్లో కిచెన్‌ గార్డెన్ల ఏర్పాటు 

నారాయణపేట టౌన్‌ : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఇకపై తాసిల్దార్‌ కార్యాలయాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో సమస్యలు తలెత్తకుండా సాంకేతిక, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్‌ హరిచందన ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ నిర్వహణపై జిల్లాలోని తాసిల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. తాసిల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల సేవలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. తాసిల్దార్లు వారి వారి కార్యాలయాల్లో అన్ని వసతులు సమకూర్చుకోవాలన్నారు. భూములు రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్‌ చేసే విధానాన్ని వెరిఫై చేసి ఫైనల్‌ చేసే బాధ్యత వారిదేనన్నారు. ప్రజలను భయాందోళనకు గురి చేయకుండా వారు ఇచ్చిన వివరాలను వెరిఫై చేసుకొని ఫైనల్‌ చేయాలని ఆదేశించారు. గ్రామ వీఆర్‌వోల సేవలను భూ సంబంధిత వ్యవహారాలకు కాకుండా ఇతరత్ర పథకాలకు, సమాచార సేకరణకు వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్లు 

  జిల్లాలోని పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ హరిచందన కోరారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. హరితాహారం లక్ష్యం మేరకు వివిధ శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలోల న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేసి కూరగాయల మొక్కలు పెంచాలన్నారు. కోస్గి, మక్తల్‌ మున్సిపాలిటీలలో మొక్కలకు జియో ట్యాగింగ్‌ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఆర్డీవో కాళిందిని, జిల్లా ఫారెస్ట్‌ అధికారి గంగిరెడ్డి, వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేయాలి

 పోషణ్‌ మాసం సందర్భంగా ప్రతి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న న్యూట్రీ గార్డెన్లకు అవసరమైన కూరగాయల విత్తనాలను గురువారం సీడీపీవోలకు ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచందన పంపిణీ చేశారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్లను ఏర్పాటు చేయాలని వారు సూచించారు. పోషణ్‌ మాసంలో ఇంకా అదనంగా ఏ సాయం అవసరమున్నా అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఆర్డీవో కాళిందిని, డీడబ్ల్యూవో జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పోస్టర్‌ విడుదల చేసిన కలెక్టర్‌

  నేషనల్‌ టీబీ ఎలిమినేషన్‌ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ హరిచందన విడుదల చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. logo