గురువారం 22 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 24, 2020 , 03:23:08

హ‌రిత నిల‌యం

హ‌రిత నిల‌యం

  • ఇంట్లోనే మూలికలు, పూలు,పండ్ల మొక్కల పెంపకం
  • 450 మొక్కలకు పైగా సంరక్షణ
  • ఆదర్శంగా నిలుస్తున్న శివకుమార్‌

దేవరకద్ర రూరల్‌ : అతనో ఎలక్ట్రికల్‌ సర్వీస్‌ ఇంజినీర్‌.. తన ఇంటిని హరిత నిలయంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు.. అనుకున్న దే తడువుగా ఒక్కటి కాదు.. రెండు కాదు.. 450 రకాల మొక్కలను పెంచుతున్నాడు.. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మొక్కలను ఇంటి ఆవరణలో ప్రత్యేకంగా తయారు చేయించిన తొట్టిలలో పెంచుతున్నాడు. వాటికి సకాలంలో నీటిని, స్వయంగా తయారు చేసిన సేంద్రియ ఎరువులను అందిస్తూ సంరక్షిస్తున్నాడు.. దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన వెలిమ శివ కుమార్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు..

తన స్వర్గీయ మాతృమూర్తి పేరిట శారదా నిలయంగా మా ర్చాడు.. రకరకాలైన మూలికలు, పండ్లు, పూల మొక్క లు పెంచుతున్నాడు.. పైజా, అరేకా, నందివర్ధన, ముద్ద నందివర్ధన, లెమన్‌గ్రాస్‌, ధన్వంతరి, సరస్వతి, పారిజాత, కలబంధ, క్యాప్టల్స్‌, తమలపాకులు (తమలపా కు, కలకత్తా తమలపాకు, బర్మా తమలపాకు), తులసి, వాము, మునగ వంటి పలురకాల మూలికల మొక్క లు ఉన్నాయి.. కాశ్మీర్‌ ఆపిల్‌, సిమ్లా ఆపిల్‌, తెల్ల, నల్ల గ్రేప్స్‌, అంజీర, పొప్పిడి, నేరేడు, జామ, సపోట, బ త్తాయి, చక్కెరకేళి, బనానాబార్‌, కరి వంటి మూడు ర కాల అరటి చెట్లు ఉన్నాయి.. మల్లి, బొడ్డుమల్లి, జాజిమల్లి, లిల్లీ, రేన్‌లిల్లీ, పీస్‌లిల్లీ, రాత్కారాణి, గన్నేరు, రు ద్రాక్ష, రామబాణం వంటి మరెన్నో రకాలైన పూల మొ క్కలు పెంచుతున్నాడు.. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి వంటి ప్రముఖులు ఇంటిని సందర్శించి శివకుమార్‌ను అభినందించారు..

మొక్కలు అంటే అమితమైన ప్రేమ.. 


మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇ ష్టం. నిత్యం కొన్ని మొక్కల చొప్పున పరిశీలి స్తూ, వాటిలో ఉన్న చెత్త, కలుపును తొలగించి నీటిని అందిస్తా. స్వయంగా తయారు చేసిన సేంద్రియ ఎరువును వేస్తాను. మొక్క మొక్కకూ కొంత దూరాన్ని ఉండేలా తొట్లను అమర్చాను. ఆరు మాసాలకోసారి తొట్టిలో ఉన్న మట్టిని తొలగించి కొత్త మట్టిని నింపుతుతా. మరో వెయ్యికి పైగా మొక్కలను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను..   

- వెలిమ శివకుమార్‌, ఎలక్ట్రికల్‌ సర్వీస్‌ ఇంజినీర్‌, కౌకుంట్ల

అందరూ మొక్కలను పెంచాలి..


మానవ మనుగడకు అవసరమయ్యే ప్రాణవాయువును అందిస్తున్న మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఇంటిలో మొక్కలు ఉండటం ద్వారా స్వచ్ఛమైన వాతావరణం అందుతుంది. మూలికలకు సంబంధించిన మొక్కలూ నాటకోవాలి. పిల్లలకు జలుబు, దగ్గు వంటివి వచ్చినప్పుడు మూలికలతో కషాయం చేసి తాగించాలి. ఇంటి పరిసరాల్లో దోమలు, ఈగలు రాకుండా కూడా కాపాడుతుంది. 

- వెలిమ తార, గృహిణి, కౌకుంట్లlogo