మంగళవారం 27 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 23, 2020 , 04:13:48

పనులు పూర్తి చేయడంలో అలసత్వమెందుకు..?

పనులు పూర్తి చేయడంలో అలసత్వమెందుకు..?

మద్దూరు : అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యమెందుకు.. అధికారులు పనితీరు మార్చుకోవాలని.. లేదం టే చర్యలు తప్పవని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని షా గార్డెన్‌లో అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు మండలాల్లో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్న అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా శ్మ శాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, పార్కులు, మరుగుదొడ్లు, విద్యుత్‌ సమస్యలపై ప్రజాప్రతినిధులతో వివరాలు సేకరించి సంబంధిత అధికారులతో చర్చించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెలరోజుల్లో రెండు మండలాల్లో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూ సమస్యలు ఉన్న గ్రామాల్లో వెంటనే స్థలాలు సేకరించి వెంటనే పంచాయతీలకు అప్పగించాలని తాసిల్దార్లకు సూచించారు. తడి, పొడి చెత్తపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు చెప్పిన సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంరతం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తర్వాత మద్దూరులో నిర్మిస్తున్న రైతువేదికను కలెక్టర్‌ హరిచందనతో కలిసి ఆయన పరిశీలించారు. నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమాల్లో సీఈవో కాళిందిని, డీపీవో మురళి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ జగదీశ్‌, కోస్గి ఎంపీపీ మధుకర్‌రావు, తాసిల్దార్‌ వెంకటేశ్‌, ఎంపీడీవో కాళప్ప, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo