బుధవారం 28 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 20, 2020 , 05:52:40

ప్రతి చిన్నారికీ టీకా వేయించాలి

ప్రతి చిన్నారికీ టీకా వేయించాలి

నారాయణపేట టౌన్‌ : ప్రతి చిన్నారికీ టీకా వేయించి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలని బాలింతలకు పీపీ యూనిట్‌ వైద్యాధికారి బాలాజీరావు సింగాడే సూచించారు. శనివారం నిర్వహించే ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని పళ్ల జంగిడిగడ్డ అంగన్‌వాడీ కేం ద్రంలో చిన్నారులకు టీకాలు వేశారు. టీకాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. 

అదేవిధంగా పట్టణంలోని ధూల్‌పేట్‌ అంగన్‌వాడీ కేం ద్రంలో నిర్వహించిన పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పి ంచారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పాలు, గుడ్లు, బాలామృతాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొవిడ్‌- 19 రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో వార్డు కౌన్సిలర్‌ ప్రమీల, ఏఎన్‌ఎం జయంతి, అంగన్‌వాడీ టీచర్లు కృష్ణవేణి, అనిత, ఆశ వర్కర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. logo