బుధవారం 21 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 20, 2020 , 05:52:37

ఇంటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ధన్వాడ : మండల మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ ఉమాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయని, ఈ నెల 30వ తేదీ చివరి వరకు అర్హతగల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

డిగ్రీ ప్రవేశాల కోసం..

నారాయణపేట : 2020-21కి గానూ మాజీ సైనికులు, వితంతువుల ఆడపిల్లలు భువనగిరి జిల్లాలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ ఆర్డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి వనజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌లో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులై ఉండి, విద్యార్థిని ఎత్తు 150 సెం.మీ ఉండాల న్నారు. ఎంపికైన విద్యార్థులకు డిగ్రీ కోర్సుతోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో ఆఫీసర్‌గా ఎంపిక కోసం ఉచితంగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. 10వ తరగతి స్థాయిలో ఇంగ్లిష్‌, మాథ్స్‌, సైన్స్‌, జనరల్‌ అవేర్నెస్‌ అంశాలపై రాత పరీక్షతోపాటు ఫిజికల్‌ టెస్ట్‌ ఉంటుందన్నారు. ఆసక్తి గల యువతులు www.tswreis.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మిగతా వివరాలకు తాసిల్దార్‌ శేషయ్య 9177930960కు ఫోన్‌ చేయాలని, ప్రాంతీయ సంక్షేమ కార్యాలయం మహబూబ్‌నగర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు. 


logo