ఆదివారం 01 నవంబర్ 2020
Mahabubnagar - Sep 20, 2020 , 05:42:07

మహబూబ్‌నగర్‌ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక

మహబూబ్‌నగర్‌ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక

మహబూబ్‌నగర్‌ క్రైం: మహబూబ్‌నగర్‌ పారిశ్రామిక సహకార సంఘం కమిటీ ఎన్నికైంది. కమిటీకి ఏడాది క్రితమే ఎన్నికలు జరగగా అప్పట్లో ఫలితాలు వెల్లడించకూడదని కోర్టు ఆదేశించింది. తాజాగా కోర్టు ఆదేశాలతో ఫలితాలను వెల్లడించారు. కల్లుగీత సంఘానికి గత సంవత్సరం 23-5-2019న ఎన్నికలు జరిగాయి. అయితే అప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించగా ఎన్నికలు నిర్వహించినా ఫలితాలు వెల్లడించకూడదని ఆదేశాలివ్వడంతో వెల్లడించలేదు. ఈ నెల 17న ఫలితాలు విడుదల చేయవచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల అధికారి ఫలితాలు విడుదుల చేశారు. 

సంఘం అధ్యక్షుడిగా ఆర్‌.శరత్‌బాబుగౌడ్‌, ఉపాధ్యక్షుడిగా సిద్ధయ్య, డైరెక్టర్‌గా చక్రవర్తిగౌడ్‌, మహిళా కోటాలో రెండు డైరెక్టర్‌ స్థానాలకు గాను ఒక స్థానానికే అప్పట్లో నామినేషన్‌ వేయడం జరిగింది. ఒక స్థానానికి మాణిక్యమ్మ ఎన్నికవగా, మరో స్థానం ఖాళీగా ఉంది. ఈ కమిటీ ఐదేండ్లపాటు అధికారంలో ఉంటుంది. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను శనివారం మహబూబ్‌నగర్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఎస్సై శ్రీనివాస్‌ సత్కరించి వారికి నియామక పత్రాలు అందజేశారు.