శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 20, 2020 , 04:40:50

చెక్‌డ్యాంలో పడి యువకుడు గల్లంతు

చెక్‌డ్యాంలో పడి యువకుడు గల్లంతు

డ్చర్లటౌన్‌ : మండలంలోని లింగంపేట శివారులోని వాగు చెక్‌డ్యాంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అప్రోజ్‌(23) అలియాస్‌ అబ్బు శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి చెక్‌డ్యాం వద్దకు వెళ్లాడు. చెక్‌డ్యాంలో సెల్ఫీ దిగుతుండగా అప్రోజ్‌ ప్రమాదవశాత్తు జారీ పడ్డాడు.  వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల సీఐ వీరాస్వామి ఘటన స్థలానికి వెళ్లి గ్రామస్తుల సహాయంతో గాలింపుచర్యలు చేపట్టారు.

లారీడ్రైవర్‌ అయిన అప్రోజ్‌ గల్లంతుకావడంతో యువకుడి కుటుంబంలో విషాదం నెలకొన్నది. యువకుడు గల్లంతైన విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్‌ తేజస్‌ నండ్లాల్‌ పవార్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య సాయంత్రం ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున గ్రామస్తులు, మృత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.


logo