బుధవారం 02 డిసెంబర్ 2020
Mahabubnagar - Sep 19, 2020 , 02:32:44

పాలమూరులోనే అత్యధిక ఇండ్లు

పాలమూరులోనే అత్యధిక ఇండ్లు

  • పేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం త్వరలోనే దివిటిపల్లి ఇండ్ల్లు పంపిణీ
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
  • ఏనుగొండలో ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన 

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : రాష్ట్రంలోనే అ త్యధికంగా మహబూబ్‌నగర్‌లో డబుల్‌ బెడ్రూం ఇం డ్లు  నిర్మించామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జి ల్లా కేంద్రంలోని ఏనుగొండ మౌలాలిగుట్ట వద్ద రూ.31కోట్ల 16లక్షల వ్యయంతో నిర్మించనున్న 588 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాప న చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌బె డ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారన్నారు. రెండేండ్ల కిందట క్రిస్టియన్‌పల్లిలో ఇండ్లు పంపిణీ చేశామని, ఇటీవల మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా వీరన్నపేటలో పేదలకు ఇండ్లు ఇచ్చామని గుర్తుచేశారు. త్వరలోనే దివిటిపల్లిలో నిర్మించిన ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. ఏనుగొండలో చేపట్టిన ఇండ్ల నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి పేదలకు అందజేస్తామని చెప్పారు.  

ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలి

మహబూబ్‌నగర్‌ : ప్రతి కుటుంబం సంతోషంగా జీ వించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించా రు. అనంతరం ఓటరు నమోదు కోసం కేటాయించిన పార్టీ నాయకులతో మంత్రి మాట్లాడారు. ప్రతి గడప కూ వెళ్లి పట్టభద్రుల వివరాలు సేకరించాలని సూచించారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తున్నదని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.

ఐటీ కారిడార్‌ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం చే స్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించా రు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అందరూ సమిష్టిగా పని చేయాలని కోరా రు. అనంతరం ఇటీవల రోడ్డు మృతి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త వేపూరిగేరివాసి గంజి శ్రీనివాసులుకు మంజూరైన రూ.2లక్షల టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్సురెన్స్‌ చెక్కును బాధిత కుటుంబసభ్యులకు మంత్రి అందజేశారు. అలాగే, బాలాజీనగర్‌కు చెందిన

అలిమియాకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.6లక్షల చెక్కును అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నండ్లాల్‌ పవర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొరమోని వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, గ్రం థాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, హౌసింగ్‌ పీడీ భాస్కర్‌, కౌన్సిలర్‌ రామాంజనేయులు ఉన్నారు.