గురువారం 22 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 19, 2020 , 02:32:44

వాగు నీటిలో సరదాగా..

వాగు నీటిలో సరదాగా..

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ  : పాలమూరు జిల్లాలో ఎక్కడ చూసినా జలసిరులే.. సీఎం కేసీఆర్‌ అపర భగీరథ ప్రయత్నంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సస్యశ్యామలం అయ్యింది.

ఇటీవ కురిసిన ప్రతి చినుకునూ ప్రభుత్వం ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నది. దీంతో నీటి ఖిల్లాగా మారింది. కాగా శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం బండర్‌వల్లి చెక్‌ డ్యాంను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సందర్శించారు. వాగు పారుతుండటంతో ఆనందం వ్యక్తం చేశారు. నీళ్లలోకి దిగి కొద్దిసేపు సరదాగా గడిపారు. ఇద్దరు కలిసి సెల్ఫీలు తీసుకున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కోయిల్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్లను తెరవడంతో వరద మహబూబ్‌నగర్‌-రాయిచూరు హైవేపై ఉన్న బండర్‌వల్లి చెక్‌ డ్యాంపై నుంచి పారుతున్నది. చిన్న చింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలోని ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. 


logo