ఆదివారం 24 జనవరి 2021
Mahabubnagar - Sep 15, 2020 , 08:20:41

ముంచెత్తిన ముసురు

ముంచెత్తిన ముసురు

  • రెండు రోజులుగా ముసురుతో కూడిన మోస్తరు వర్షం
  • ఉధృతంగా పారుతున్న వాగులు
  • పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా ముసురు వర్షం కురుస్తున్నది. పలు మండలాల్లో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. అచ్చంపేట, బల్మూర్‌ మండలాల్లో చౌటపల్లి, చెంచుఫల్గుతండా, చంద్రవాగులు జోరుగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్లమలలో భారీగా వర్షం కురిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సగటున 5 మి.మీ., నాగర్‌కర్నూల్‌లో 24.4 మి.మీ. నారాయణపేటలో 16.15 మి.మీ., జోగుళాంబ గద్వాల 13.7మి.మీ., వనపర్తి 20.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.                      - ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నెట్‌వర్క్‌logo