l58 జిల్లా కార్యాలయాలు ఒకే చోటకు..

- సమీకృత భవన నిర్మాణం మన రాష్ట్రంలోనే..
- కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో కలిసి కలెక్టరేట్ పరిశీలన
58 జిల్లా కార్యాలయాలు ఒకే చోటకు తెస్తూ చేపట్టిన సమీకృత భవన నిర్మాణం దేశంలోనే ఎక్కడా లేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌ను కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మహబూబ్‌నగర్-జడ్చర్లలో రోడ్డు విస్తరణలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు.
- మహబూబ్‌నగర్/మున్సిపాలిటీ
58జిల్లా కార్యాలయాలు ఒకే చోటకు..
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో కలిసి నూతన కలెక్టరేట్ భవనం పరిశీలన
మహబూబ్‌నగర్: దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సమీకృత నూతన కలెక్టరేట్ భవనాలను నిర్మిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌ను కలెక్టర్ ఎస్. వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి భవన నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో ఉండేలా 58ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. తెలంగాణ పథకాలు అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సిములు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ సురేందర్, తాసిల్దార్ పార్థసారధి, ఆర్అండ్బీ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
పట్టణంలో శనివారం మృతిచెందిన బాధిత కుటుంబాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. పట్ణణ కేంద్రంలో కౌన్సిలర్ కట్టారవికిషన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు హాఫీజ్ ఇద్రీస్ తండ్రి, ప్రముఖ ఇస్లామిక్స్కాలర్ ఖాజామైనోద్దీన్, కౌన్సిలర్ రాంలక్ష్మణ్ తండ్రి కిష్టన్న, వీరన్నపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకులు మోసిన్ తండ్రి సయ్యద్ పాషా మృతి చెందడంతో వారి వారి ఇండ్లకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.
రోడ్డు పనుల పరిశీలన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్-జడ్చర్లలో రోడ్డు విస్తరణలో భాగంగా జరుగుతున్న పనులను శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. కొత్తతండా వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా మిషన్ భగీరథ పైప్‌లైన్ దెబ్బతినడంతో నీటి సరఫరా నిలిపిపనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యుద్ధ్దప్రాతిపదికన పనులు పూర్తి చేసి శనివారం నుంచి నిరంతర తాగునీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు వేగంగా చేయాలని అధికారులకు సూచించారు.
తాజావార్తలు
- సీఎం కేసీఆర్ ప్రతి ఆలోచన ప్రజల అభివృద్ధి కోణంలోనే
- ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- బ్రాండ్ బెస్ట్‌లో జియోకు ఐదో స్థానం.. కోకాకోలాకు ఫోర్త్ ర్యాంక్
- సూపర్‌స్టార్ జాకీచాన్ తో దిశాపటానీ
- ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
- నిజాంసాగర్‌కు పూర్వవైభవం తెస్తాం
- బీజేపీలో చేరిన పుదుచ్చేరి మాజీ మంత్రి
- లంగావోణిలో సాయిపల్లవి న్యూ లుక్ కు 'ఫిదా'
- జనగామలో మాజీ కౌన్సిలర్ దారుణ హత్య..
- జగ్గారెడ్డిపై నల్లగొండ టీఆర్ఎస్వీ నాయకుల ఫిర్యాదు