గురువారం 04 మార్చి 2021
Mahabubnagar - Aug 28, 2020 , 04:46:37

పాలమూరు దవాఖానను మోడల్‌గా తీర్చిదిద్దుతాం

పాలమూరు దవాఖానను మోడల్‌గా తీర్చిదిద్దుతాం

  •       హైదరాబాద్‌ తరహాలో ఇక్కడే వైద్యం 
  • g      ప్రస్తుత కలెక్టరేట్‌లో చిల్డ్రన్స్‌ దవాఖాన 
  • g      ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
  • g      కరోనాకు ఎవరూ భయపడొద్దు
  • g      ఇన్ఫెక్షన్‌, ప్రివెన్షన్‌ కంట్రోల్‌ స్పెషల్‌ విజయ్‌ ఎల్దండి

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం): పాలమూరు జిల్లా జనరల్‌ దవాఖానను మోడల్‌గా తీర్చిదిద్దుతామని, సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ కంట్రోల్‌ సేప్టీ అంశాలపై వైద్యులు సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన అమెరికాలోని చికాగో ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ క్లినిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ్‌ ఎల్దండితో కలసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన పదిమంది డాక్టర్లలో ఒకరైనా డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి తెలంగాణలో జన్మించడం గర్వకారణమన్నారు. ఆయన కమ్యూనికేబుల్‌ వ్యాధులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చాలా కృషి చేశారన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ దవాఖానను సందర్శించి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై సూచనలు, సలహాలు అందించాలని విజయ్‌ ఎల్దండి ఇంటికి వెళ్లి ఆహ్వానించడం జరిగిందని, వారు ఆహ్వానాన్ని మన్నించి జిల్లాకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రత్యేకమైన చర్యలతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. దీంతో దవాఖానలో ఓపీ శాతం పెరిగిందని డెలివరీలు, శస్త్రచికిత్సలు పెరిగాయన్నారు. ఒక్కప్పుడు 17 మంది డాక్టర్లు ఉండేవారని, ఇప్పుడు 200మంది డాక్టర్లు, 450 మంది నర్సులు అందుబాటులో ఉన్నారని, హైదరాబాద్‌ తరహాలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌ను కొత్తగా నిర్మిస్తున్న భవనానికి తరలించిన తర్వాత పాత భవనంలో హైదరాబాద్‌లోని నీలోఫర్‌ దవాఖాన మాదిరిగా ఇక్కడ కూడా చిన్నపిల్లల దవాఖాన తయారు చేస్తామని, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి అన్నారు. డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతిఒక్కరూ వైరస్‌ లేకుండా పనిచేయాలని, కరోనా, ఎలాంటి వైరస్‌ వచ్చినా భయపడొద్దని, వ్యక్తిగత శుభ్రత, భౌతికదూరం, మాస్కులు పెట్టుకొని నిబంధనలు పాటించాలన్నారు.

మన ఆలోచన పద్ధతి మారాలని, కరోనా రాకుండా స్వచ్చమైన గాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, స్వచ్ఛమైన వాతావరణంలో ఉండాలన్నారు. ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌ ఉన్నావారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందన్నారు. 25 ఏండ్లుగా వైరస్‌ రాకుండా ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నానని తెలిపారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ర్టాల్లో హెచ్‌ఐవీ, టీబీ రాకుండా ప్రజలను ఎలా కాపాడుకోవాలని దృష్టి సారించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు దవాఖానల్లో కరోనా వైరస్‌పై వైద్య సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌ జనరల్‌ దవాఖానను రాష్ట్రంలోనే మోడల్‌గా తయారు చేయాలని తెలిపారు. ఇలాంటి అవకాశం కల్పించినందుకు మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ రాంకిషన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సిములు, అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవార్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ వెంకటయ్య, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియాన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo