మంగళవారం 20 అక్టోబర్ 2020
Mahabubnagar - Aug 11, 2020 , 08:27:31

కరోనా మృతులకు కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించాలి

కరోనా మృతులకు కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించాలి

మహబూబ్‌నగర్‌: అపోహలు, వీడి ఆప్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌తో ఎవరైన మరణిస్తే వారి కుటుంబ సభ్యులు కొవిడ్‌ నిబంధనల మేరకు మృతుడికి అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. అందరూ ఉండి అనాథ శవాల్ని చేయకూడదని మంత్రి తెలిపారు. అంతిమ సంస్కారాలు నిర్వహించినంత మాత్రన వైరస్‌ అంటుకోదన్నారు. గాంధీ తదితర దవాఖానల్లో కరోనాతో మృతి చెందిన వారిని వారి పిల్లలే తీసుకువెళ్లడానికి ముందుకు రాకపోవడం మృగత్వాన్ని సూచిస్తుందన్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం పీపీఈ కిట్లు వేసుకొని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చన్నారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేసేందుకుగాను మహబూబ్‌నగర్‌లో ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు తాను హాజరైనట్లు తెలియజేశారు. కరోనాతో చనిపోయిన తల్లిదండ్రులను తీసుకువెళ్లడానికి ముందుగా రాని వారి జన్మవృథా అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తీసుకున్న నిర్ణయంపట్ల పలువురు అభినందిస్తున్నారు. logo