ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Aug 11, 2020 , 08:25:57

అపోహ‌లు వీడండి

అపోహ‌లు వీడండి

  • ఆప్తులకు అంత్యక్రియలు నిర్వహించండి
  • కరోనాకు భయపడొద్దు..జాగ్రత్త పడాలి
  • వైరస్‌తో 2శాతం మాత్రము చనిపోతున్నారు
  • ఎస్వీఎస్‌లో అత్యాధునిక కరోనా టెస్టింగ్‌ సెంటర్‌ ప్రారంభం
  • 100 పడకలతో కరోనా ప్రత్యేక వార్డు 
  • ఎక్సైజ్‌శాఖ మంత్రి డా. శ్రీనివాస్‌ గౌడ్‌
  • కరోనాతో మృతిచెందిన ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు హాజరు

వైరస్‌తో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులు కొవిడ్‌ నిబంధనల మేరకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని మంత్రిశ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. ఎస్వీఎస్‌ దవాఖాన, మెడికల్‌ కళాశాలలో సోమవారం కొవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. అంత్యక్రియలు నిర్వహించినంత మాత్రాన వైరస్‌ అంటుకోదని, అపోహలు వీడి ఆప్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్నారు. కొవిడ్‌-19కు ప్రజలు భయపడొద్దని, పుకార్లు నమ్మి అనవసరంగా ఆందోళన చెందొద్దని సూచించారు. హైదరాబాద్‌కు వెళ్లకుండా పాలమూరులోనే కరోనా పరీక్షలు, వైద్యసేవల కోసం అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎస్వీఎస్‌ దవాఖానలో100 పడకలతో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు.  అనంతరం మహబూబ్‌నగర్‌లో కరోనాతో మృతిచెందిన ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు మంత్రి హాజరయ్యారు.

- మహబూబ్‌నగర్‌/వైద్యవిభాగంlogo