మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Aug 10, 2020 , 02:32:16

కరోనాకు ఖరీదైన మందులు

కరోనాకు ఖరీదైన మందులు

  • ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి..
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం/భూత్పూరు : కరోనా కోసం ఉమ్మడి జిల్లాకు అత్యవసర మందులైన 1,750 రేమిడివియర్‌ ఇంజక్షన్లు, 4,500 ఫ్యాబీ ప్లూ ట్యా ట్లెట్లు వచ్చాయని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.  ఖరీదై న మందులు పంపించిన సీఎం కేసీఆర్‌, వైద్య శాఖ మంత్రి ఈటలకు ఆయన కృ తజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌, భూత్పూరులో మా ట్లాడుతూ కరోనాపై భయాందోళనలు వీడాలన్నారు. హైదరాబాద్‌ కార్పొరేట్‌ దవాఖానల్లో ఉండే మందులు ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో ఉంచామన్నారు. మహబూబ్‌నగర్‌ కరోనా సెంటర్‌ను 100 పడకల నుంచి 220 పడకలకు పెంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 26 టెస్టింగ్‌ కేంద్రాలు ఉండగా.. సోమవారం నుంచి ఎస్వీఎస్‌ దవాఖానలో పరీక్షలు  ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు లేకుండా బయటకు రా వొద్దని సూచించారు. మంత్రి వెంట ము న్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌడ్‌, నాయకులు నారాయణగౌడ్‌, మురళీధర్‌గౌడ్‌, అశోక్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు. 

నాణ్యమైన టిఫిన్‌ అందించండి 

  మహబూబ్‌నగర్‌ : ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన టిఫిన్స్‌ అందించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. ఆదివారం పాలమూరు జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేటు వద్ద మణికంఠ టిఫిన్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించా రు. అంతకుముందు టీ టైం కేఫ్‌ను రాం మందిర్‌ చౌరస్తాలో ప్రారంభించి పలువురికీ చాయ్‌ని అందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, మణికంఠ టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకులు నరసింహా యాదవ్‌ పాల్గొన్నారు. 

మంత్రికి రాఖీ కట్టిన ఎంపీటీసీ 

  హన్వాడ : హన్వాడ మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ నాగన్న గృహ ప్రవేశానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరయ్యారు. అనంతరం ఎంపీటీసీ కల్పన ఇంటికి వెళ్లిన మంత్రికి ఆమె రాఖీ కట్టారు. ఆమెను ఆశీర్వదించిన మంత్రి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మంత్రి వెంట ఎంపీపీ బాల్‌రాజ్‌, నాయకులు యాదయ్య, సత్యం, సాయిలు, శ్రీనివాసులు ఉన్నారు. logo