ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Aug 08, 2020 , 04:00:40

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి

కృష్ణ: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తోందన్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నతంగా రాణించాలని సూచించా రు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణిమపాటిల్‌, సర్పంచ్‌ రాధామహదేవ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు విజయపాటిల్‌, హెచ్‌ఎంలు నిజామోద్దీన్‌, మం డల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివప్ప, టీఆర్‌ఎస్‌ మం డల ప్రధాన కార్యదర్శి మోనేశ్‌, యువనాయకులు శివరాజ్‌పాటిల్‌, శంకర్‌నాయక్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పేదలకు ఆపన్నహస్తం సీఎంఆర్‌ఎఫ్‌

మక్తల్‌ టౌన్‌: పేదల ఆపన్నహస్తం సీఎం సహాయనిధి అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మక్తల్‌ పట్టణంలోని  ఎమ్మెల్యే నివాసంలో మండలానికి చెందిన కొండదొడ్డి గ్రామానికి చెందిన అశోక్‌కు మంజూరైన రూ.56వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సీఎం సహాయనిధి నుంచి నమోదు చేసుకున్న ప్రతిఒక్కరికీ సీఎం సహాయనిధి అందిందని ఇప్పటికీ ఎక్కువగా ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువగా సీఎం కేసీఆర్‌ నుంచి సీఎంఆర్‌ఎఫ్‌ను అం దుకున్నామని తెలిపారు. అదేవిధంగా కష్టకాలంలో మీకు నేనున్నాను అని సీఎం కేసీఆర్‌ తనవంతుగా సహాయం అం దిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు కరోనా రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న కారణంగా భయబ్రాంతులకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. 

logo