ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Aug 08, 2020 , 04:00:38

నూతన డిజైన్లతో చీరలు నేయాలి

 నూతన డిజైన్లతో చీరలు నేయాలి

నారాయణపేట టౌన్‌: చేనేత కార్మికులు తమలో ఉన్న కళలను బయటకు తీసి నూతన డిజైన్లతో చీరలను నేసి చేనేత రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్‌ హరిచందన స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కలెక్టరేట్‌లో చేనేత కార్మికులకు నష్కం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావరస సరుకుల కి ట్లను కలెక్టర్‌ హరిచందన పంపిణీ చేశారు. అనంత రం కలెక్టర్‌ మాట్లాడుతూ బియ్యం, పప్పు, గోధుమపిండి, ఆయిల్‌ ప్యాకెట్‌, ఉప్పు ప్యాకెట్‌లతో కూడిన ఈ కిట్లను జియో ట్యా గింగ్‌ ఉన్న చేనేత కార్మికుల కు అందజేసినట్లు చెప్పారు. చేనేత కార్మికులు ప్రభు త్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలోని అగ్రహార్‌పేట్‌లో చేనేత కార్మికుల మగ్గాలను పరిశీలించి మాట్లాడారు. అనంతరం చేనేత మహిళా కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. 


logo