ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Aug 08, 2020 , 02:36:46

‘రైతు వేదిక’ పనుల్లో వేగం పెంచండి

‘రైతు వేదిక’ పనుల్లో వేగం పెంచండి

  • n సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేయాలి  
  •   n ఇంజినీర్లతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

  మహబూబ్‌నగర్‌ : రైతు వేదిక భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. శుక్రవారం పాలమూరు జెడ్పీ సమావేశ మందిరం లో ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భం గా మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన రైతు వేదిక భవనాల గ్రౌండ్‌ లెవల్‌ పనులకు సంబంధించి వివరాలను వాట్సాప్‌లో తనకు పంపించాలన్నారు. ఏ రా ష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, కంపోస్ట్‌ కిట్లు పూర్తి చేయాలన్నారు. సా గుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నట్లు తెలిపారు. ఏనుగొండ వద్ద 700 వందల ఇండ్ల పనులు ప్రారంభించాలని హౌ సింగ్‌ అధికారులను మంత్రి ఆదేశించా రు. ఎకో పార్కును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సివిల్స్‌ పరీక్షలో ఉ త్తీర్ణత సాధించిన నారాయణపేటకు చెం దిన రాహుల్‌ను మంత్రి సన్మానించారు. 

‘చేనేత మొగ్గలు’ పుస్తకావిష్కరణ

  పాలమూరు : పాలమూరు జిల్లా ప్రము ఖ కవి డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ రచించిన చేనేత మొగ్గలు కవితా సంపుటిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆవిష్కరించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పుస్తకాన్ని ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కవితా సంపుటిలు మరెన్నో రాయాలని ఆయన ఆ కాంక్షించారు. కార్యక్రమాల్లో  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుచరిత, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వెంకటరమణ, మిషన్‌ భగీరథ ఈఈ వెంకట్‌రెడ్డి, హౌసింగ్‌ అధికారి రమణారావు, అధికారులు, డీఆర్వో శ్రీనివాస్‌, రిటైర్డ్‌ డీఈవో విజయ కుమార్‌, వెంకట్రాముడు, గం గాధర్‌, ప్రభాకర్‌, యాదయ్య, శశాంక్‌ తదితరులు పాల్గొన్నారు. logo