ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Aug 08, 2020 , 02:36:46

100నుంచి 220స్థాయికి

100నుంచి 220స్థాయికి

  • n  పాలమూరు కొవిడ్‌ సెంటర్‌ బెడ్ల పెంపు  
  • n  ప్రతి బెడ్డుకూ ఆక్సిజన్‌ సదుపాయం
  • n   ప్రైవేటు దవాఖానల్లోనూ కరోనా వైద్యం  
  •  n   26 పీహెచ్‌సీల్లో పరీక్షలు 
  • n   విలేకరుల సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు కొవిడ్‌ సెంటర్‌ వంద పడకల స్థాయి నుంచి 220 వరకు పెంచినట్లు ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఇకపై కరోనా చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో 67 వెంటిలే టర్లు ఏర్పాటు చేశామన్నారు. 26 పీహెచ్‌ సీల్లో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి ఎస్వీఎస్‌ దవాఖానలో కొవిడ్‌ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. 

- మహబూబ్‌నగర్‌ ప్రతినిధి/నమస్తే తెలంగాణ 


  మహబూబ్‌నగర్‌ ప్రతినిధి/నమస్తే తెలంగాణ : కరోనా చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మహబూబ్‌నగర్‌లోనే అన్ని సౌకర్యాలతో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శుక్రవారం పాలమూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు భయపడకుండా ధై ర్యంగా ఉండాలని సూచించారు. అందరిపై ఈ బాధ్యత ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న వంద పడకల కొవిడ్‌కేర్‌ సెంటర్‌ను రెండ్రోజుల్లో 220 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.  ప్రతి బెడ్డుకూ ఆక్సిజన్‌ అందించేందుకు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నా రు. ఎక్కడా లేని విధంగా 67 వెంటిలేటర్లు ఏర్పాటు చే శామన్నారు. 26 పీహెచ్‌సీల్లో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం నుంచి జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్‌ దవాఖానలో కూడా టెస్టులు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో అందించే వైద్య సౌకర్యం పా లమూరు జనరల్‌ దవాఖానలో అందిస్తున్నామని వివరించారు. ర్యాపిడ్‌ కిట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు. 108, 104 వాహనాల్లో అన్ని రకాల సదుపాయాలతో అవసరమైన సిబ్బందితో వెళ్లి పరీక్షలు చేయాలని, ము ఖ్యంగా మారుమూల తండాలకు వెళ్లాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిని వెంటనే హోం క్వారంటైన్‌కు పంపి ంచాలని సూచించారు. ఇరుకు ఇండ్లలో ఉండే వారిని స్థానికంగా ఉండే పాఠశాలల్లో ఉంచాలన్నారు. భయపడకుండా చైతన్య పర్చాలన్నారు. బ్లాక్‌లో అధిక ధరల కు విక్రయిస్తున్న  రెమిడి సివిర్‌  ఇంజిక్షన్లను 5 లక్షలు కొనుగోలు చేశామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయా ల్లో పనిచేసే వారికి, ఉద్యోగ విరమణ పొందిన వారికి వెల్‌నెస్‌ సెంటర్లలో ప్రత్యేక సెంటర్‌ ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ప్రతి రో జూ డాక్టర్‌ లేదా నర్సు వెళ్లి పర్యవేక్షించాలన్నారు. మం దులు, పండ్లు పంపిణీ చేసేందుకు బ్యాగులు తయారు చేయించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.  కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా.. మా స్కులు ధరించకుండా వ్యాపారులు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూ చించారు. కరోనాపై ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలని, టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావు, అడిషనల్‌ కలెక్టర్‌ సీతారామారావు, ఆర్డీవో శ్రీనివాస్‌, డీఎంహెచ్‌వో కృష్ణ, ప్రభుత్వ జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పుట్టా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.logo