మంగళవారం 19 జనవరి 2021
Mahabubnagar - Aug 07, 2020 , 04:31:11

చేపల పెంపకంతో లాభాలు

చేపల పెంపకంతో లాభాలు

  •  రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితారాజేంద్ర

  మహబూబ్‌నగర్‌ రూరల్‌ : జిల్లాలో చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రాజేంద్ర అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కోడూరు మైసమ్మ చెరువులో 60 వేల చేప పిల్లలను ఆమె వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలతో అన్ని వృతుల వారు ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. చెరువుల్లోకి నీరు చేరితే చేపల పెంపకంతో మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్‌, ఎంపీపీ సుధాశ్రీ, రూరల్‌ తాసిల్దార్‌ కిషన్‌ నాయక్‌, సర్పంచ్‌ శ్రీకాంత్‌గౌడ్‌, మత్స్య కార్మిక సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.