మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Aug 05, 2020 , 02:00:39

పాలమూరును సుందరీకరించుకుందాం

పాలమూరును సుందరీకరించుకుందాం

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ పట్టణ కేంద్రాన్ని సుందరీంచుకుందామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సిములు, కౌన్సిలర్లు, మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌లో కోఆప్షన్‌ సభ్యులుగా నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులు రామలింగం, హర్షద్‌, జ్యోతి, శివరాజు, అలియాస్‌ అలివేలు, వరలక్ష్మి, రవి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్‌ పరిధిలో జర్మనీ టెక్నాలజీ సాయంతో రూపొందించిన క్లీనింగ్‌ మెషిన్ల పనితీరును, నూతనంగా పట్టణంలో నిర్మిస్తున్న జంక్షన్ల అభివృద్ధి లైటింగ్‌ సిస్టంల పనితీరును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రి పరిశీలించారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి దిశగా ముందుకెళ్దామని మంత్రి పిలుపునిచ్చారు. అందరూ ఐక్యంగా ఉండాలని, ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ షబ్బీర్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ రవికిషన్‌ రెడ్డి, కౌన్సిలర్లు రాజు, వేదవ్రత్‌ ఉన్నారు. 


logo