శనివారం 08 ఆగస్టు 2020
Mahabubnagar - Aug 02, 2020 , 08:04:01

వాల్మీకి బోయలను ఎస్ట్టీ జాబితాలో చేర్చాలి

వాల్మీకి బోయలను ఎస్ట్టీ జాబితాలో చేర్చాలి

మక్తల్‌ టౌన్‌/మరికల్‌: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మీనుగ గోపిబోయ అన్నారు. శనివారం పట్టణంలో స్థానిక నాయకులతో కలిసి మరో స్వాతంత్ర పోరాట నిరహార దీక్ష వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15న వాల్మీకి బోయలు ఎస్టీ రిజర్వేషన్‌ పునరుద్ధరణకు మరో స్వాతంత్రం పోరాటం నిరహార దీక్షను చేపట్టాలని తెలిపారు. అలాగే మరికల్‌ మండల కేంద్రంలోని వాల్మీకి దేవాలయ ప్రాంగణంలో బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ బాలకృష్ణ, అధ్యక్షుడు గోపి దీక్షకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. వాల్మీకి జయంతి అక్టోబర్‌ 31న సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో అరవింద్‌స్వామి, కొత్తపల్లి రవి, వెంకటేశ్‌, బోయ రవి, కుర్మయ్య, శ్రీనివాసులు, వెంకట్రాములు, చంద్రప్ప, నర్సింహులు, తిరుపతయ్య, రాములు, శ్రీనివాసులు పాల్గొన్నారు.logo