బుధవారం 05 ఆగస్టు 2020
Mahabubnagar - Aug 01, 2020 , 08:19:41

ఇసుక అక్రమ రవాణా బాధ్యులను వదిలిపెట్టేది లేదు

ఇసుక అక్రమ రవాణా  బాధ్యులను వదిలిపెట్టేది లేదు

l మహబూబ్‌నగర కలెక్టర్‌ వెంకట్రావు

l ఇద్దరు తాసిల్దార్లతోపాటు, 10మంది సిబ్బందిపై చర్యలు

మహబూబ్‌నగర్‌ : ఇసుక అక్రమ రవాణాలో బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. రాజాపూర్‌ మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామంలో ఫిల్టర్‌ ఇసుక అక్రమ రవాణాపై శుక్రవారం కలెక్టర్‌ తీవ్రంగా స్పందించారు. ఇసుక రవాణాలో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఇందుకు ఇద్దరు తాసిల్దార్లు, ఇద్దరు ఆర్‌ఐలు, ఇద్దరు వీఆర్వోలు, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, నలుగురు గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు మొత్తం 12 మందిని బాధ్యులను చేస్తూ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. రాజాపూర్‌ తాసిల్దార్‌ శంకర్‌, నవాబ్‌పేట తాసిల్దార్‌ రాజేందర్‌రెడ్డిలకు మెమో జారీ చేయడంతోపాటు, ఆయా మండలాల ఆర్‌ఐలు ఖదీర్‌, జ్ఞానేశ్వర్‌రెడ్డిలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రాజాపూర్‌ మండలంలోని తిర్మలాపూర్‌ వీఆర్వో రమేశ్‌, పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్‌, నవాబ్‌పేట మండలం కారూర్‌ వీఆర్వో విజయభాస్కర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఇమామ్‌, తిర్మలాపూర్‌ వీఆర్‌ఏలు ఇస్తారయ్యా, నర్సమ్మ, కారూర్‌ వీఆర్‌ఏలు అనంతమ్మ, రాములు సస్పెన్షన్‌ ఉత్తర్వులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 


logo