గురుకులాల్లో విలేజ్ సర్కిల్స్

- విద్యార్థులతో పాఠ్యాంశా బోధనకు శ్రీకారం
- ఉమ్మడి జిల్లాలో 32 గురుకులాలు
- 15,360 మంది విద్యాభ్యాసం
ప్రతి ఏడాది జూన్ మాసంలో బడిగంటలు మోగడం సహజం.. అప్పటివరకు సరదాగా గడిపిన వారంతా బడిబాట పడుతారు.. కానీ, ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉన్నది.. జూలై మాసం పూర్తి కావస్తున్నా పాఠశాలలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.. కరోనా మహమ్మారి కకావికలం చేయడంతో విద్యాబోధన ప్రశ్నార్థకంగా మారింది.. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గురుకుల పాఠశాలల్లో విలేజ్సర్కిల్స్ ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తున్నారు.. ప్రతి గ్రామంలో ఒక విద్యార్థిని లీడర్‌గా నియమించినిత్యం రెండు గంటల పాటు పాఠాలను బోధించేలా ఏర్పాట్లు చేశారు.. - మహబూబ్‌నగర్ విద్యావిభాగం
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 32 గురుకు ల పాఠశాలలు ఉన్నాయి. 15,360 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారంతా సిలబస్ నష్టపోకుండా సాంఘిక సంక్షేమ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆదేశాల మేరకు విలేజ్ సర్కిల్స్ ఏర్పాటు చేశారు. పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గురుకుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు.
విలేజ్ సర్కిల్ అంటే..
ఒక గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థులను గుర్తించి ప్రతి రోజు రెండు గంటలు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తారు. వారిలో ఒక విద్యార్థి ని లీడర్‌గా ఎంపిక చేసి పాఠాలు చెప్పడంతో పాటు చదివించేలా కృషి చేస్తున్నారు. ప్రతి రోజూ రెండు గంటల పాటు చదువడం వల్ల వి ద్యార్థులు బయట తిరగకుండా చదువు మీద దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఈ విధానం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విలేజ్ సర్కిల్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది.
ఉపాధ్యాయులు వారి సబ్జెక్టుకు సంబంధించి మూడు నుంచి ఐదు నిమిషాల నిడివి ఉన్న వీడియోలను విద్యార్థులకు వాట్సాప్‌లో పంపించి వా టిని అభ్యసించేలా ఏర్పాట్లు చేశారు. సాంఘిక సం క్షేమ శాఖ ద్వారా టీ-శాట్‌తోపాటు దూరదర్శన్, యాదగిరి చానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలలో విలేజ్సర్కిల్స్ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని గురుకులాలు..
- ఉమ్మడి జిల్లా పరిధిలో 32 గురుకుల పాఠశాలలు ఉన్నాయి.
- మహబూబ్‌నగర్ జిల్లాలో రాంరెడ్డిడూడెం, జడ్చర్ల, నంచర్ల, బాలనగర్, దేవరకద్ర.
- నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మరికల్, మద్దూర్, దామరగిద్ద, ఊట్కూర్, మక్తల్.
- జోగుళాంబగద్వాల జిల్లాలో గట్టు, మనవపాడు, అలంపూర్, గద్వాల, ఇటిక్యాల, అయిజ.
- వనపర్తి జిల్లాలో మదనాపురం, కొత్తకోట, వీపనగండ్ల, పెద్దమందడి, గోపాల్పేట.
- నాగర్‌కర్నూల్ జిల్లాలో బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, తెలకపల్లి, లింగాల, అచ్చంపేట, మన్ననూరు, జేపీ నగర్, వంగూరు, వెల్దండలలో పాఠశాలలు ఉన్నాయి.
- ప్రతి పాఠశాలలో 480 మంది చొప్పున మొత్తం 15,360 మంది విద్యార్థులు చదువుతున్నారు.
తాజావార్తలు
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
- ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్‌లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు