మంగళవారం 04 ఆగస్టు 2020
Mahabubnagar - Jul 02, 2020 , 01:21:48

పాలమూరులో రూ.100 కోట్ల రుణమేళా

పాలమూరులో రూ.100 కోట్ల రుణమేళా

  • కలెక్టర్‌ వెంకట్రావు 

మహబూబ్‌నగర్‌: ఈ నెల 13న మహబూబ్‌నగర్‌లో రూ.వందకోట్ల రుణాలు ఇచ్చేలా రుణమేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి డీఆర్డీవో అధికారులు, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, వీవోలతో కోటి విత్తన బంతుల తయారీ, బ్యాంకు లింకేజీపై వెబ్‌ ఎక్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. రుణమేళాలో వీధి వ్యాపారుల రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలు, కొవిడ్‌ రుణాలు ఎంఎస్‌ఎం రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మహాబ్రాండ్‌ ఉత్పత్తులను వేగవంతం చేయాలని డీఆర్డీవోను ఆదేశించారు. బుధవారం నాటికి మండల్లాలో 45 లక్షల 38వేల 812 విత్తన బంతులను పూర్తిచేశారని, ఇందుకు మహిళా సంఘాలను అభినందించారు. మాస్కులు, ఇతర అవసరాల నిమిత్తం ప్రతి మహిళా సంఘానికి రూ.20వేలు మంజూరు చేయాలని ఆదేశించారు. వీసీలో డీఆర్డీవో వెంకట్‌రెడ్డి, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్లు శారద, నాగమల్లిక, చెన్నయ్య, ఏపీఎంలు, డీపీఎంలు హాజరయ్యారు. 

మాస్కు వారోత్సవాలు నిర్వహించాలి

కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆరికట్టడంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో మాస్కు వారోత్సవాలను నిర్వహించాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు బుధవారం ప్రకటనలో ఆదేశించారు. తుమ్మినపుడు, దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా కరోనా వైరస్‌ సోకే సోకే అవకాశం ఉన్నందున, తుంపర్లను ఆరికట్టేందుకు ప్రతి పౌరుడు తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిన ఆవకశ్యత ఉందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలందరూ మాస్కు ధరించేలా చూసేందుకు గ్రామస్థాయిలో టాస్క్‌ఫోర్సు బృందాలను ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. బృందంలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వో, గ్రామస్థాయి పోలీసు అధికారులు ఉండాలని, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామాల్లో తిరిగి మాస్కు దరించేలా చూడాలన్నారు. మాస్కు ధరించని వారికి రూ. 1000 జరిమానా విధించి ఆ మొత్తాన్ని గ్రామపంచాయతీ ఖాతాలో జమచేయాలని ఆదేశించారు. logo