సోమవారం 03 ఆగస్టు 2020
Mahabubnagar - Jul 02, 2020 , 01:14:44

మీ సేవలు వెలకట్టలేనివి..

 మీ సేవలు వెలకట్టలేనివి..

  • వైద్యులు దైవంతో సమానం.. వారికి పాదాభివందనం
  • కరోనా సమయంలో మీ సేవలు అజరామరం
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) : కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవానికి కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరి, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులుతో కలిసి మంత్రి హాజరయ్యారు. మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ రాంకిషన్‌, హెచ్‌వోడీ రాధ, జీవన్‌, పద్మ, నర్సింహారావు, హన్మంత్‌ ప్రసాద్‌, నర్సింగ్‌, వార్డుబాయ్‌, శానిటేషన్‌ సిబ్బందిపై వారు పూల వర్షం కురిపించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దైవానికి ప్రతిరూపం డాక్టర్లని, నిత్యం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ప్రజలే ప్రాణంగా భావిస్తారన్నారు. అయితే ప్రజలు సేవలు పొందినప్పుడు మాత్రమే డాక్టర్లను గుర్తుంచుకొని తర్వాత మరిచిపోతున్నారని అన్నారు. అనంతరం మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైద్యులను, సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో సిబ్బంది  వరప్రసాద్‌, భాస్కర్‌, శంకర్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. logo