ఆదివారం 05 జూలై 2020
Mahabubnagar - Jul 01, 2020 , 01:39:18

ప్రతి కుటుంబానికీ పాడిపశువు

ప్రతి కుటుంబానికీ పాడిపశువు

  • కొడంగల్‌ ఎమ్యెల్యే పట్నం నరేందర్‌రెడ్డి 
  • దత్తత నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్‌ నిర్ణయం 
  • హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించాలి
  • జిల్లావ్యాప్తంగా పండుగలా హరితహారం

మద్దూరు: నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికీ పాడిపశువును పంపిణీ  చేయన్నట్లు ఎమ్యెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం మండలంలోని దోరేపల్లి, పెద్దిరిపాడ్‌లో హరితహారం, భీంపూర్‌లో ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. దత్తత నియోజకవర్గంలో ప్రజలు అన్నిరంగాల్లో రాణించేందుకు ప్రణాళికలు అమలు చేయాలని మంత్రి ఆదేశించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రతి కుటుంబానికీ పాడిపశువును అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరూ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్‌ చైర్మన్‌ జగదీశ్‌, తాసిల్దార్‌ తిరుపతి, ఎంపీడీవో కాళప్ప, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, ఎంపీటీసీ వెంకటయ్య, నాయకులు రామకృష్ణ, హన్మిరెడ్డి, శివకుమార్‌, వీరారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రాములుగౌడ్‌, మల్లేశ్‌, చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

ఇంటికో మొక్క నాటాలి

కోస్గి/కోస్గిటౌన్‌ : ఇంటికో మొక్కనాటి ప్రభుత్వం చేపట్టిన హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేద్దామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గుండుమల్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా శ్రేయస్సుకోసం చేపట్టిన హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా మహిళలు భాగస్వాములు కావాలన్నారు. అలాగే కోస్గి పట్టణంలోని 12వ వార్డులో కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు. ఎంపీపీ మధుకర్‌రావు, సర్పంచ్‌ విజయలక్ష్మి, నాయకులు రాజేశ్‌, హరి పాల్గొన్నారు.logo