మంగళవారం 11 ఆగస్టు 2020
Mahabubnagar - Jul 01, 2020 , 01:36:32

భూసేకరణపై కలెక్టర్‌ సమీక్ష

భూసేకరణపై కలెక్టర్‌ సమీక్ష

మహబూబ్‌నగర్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌ వెంకట్రావు వెబ్‌ఎక్స్‌ యాప్‌ లో న్యాయవాదులు, రైతులతో లైవ్‌లో మాట్లాడారు. భూసేకరణపై నమోదైన కేసులతోపాటు, భూవివాదాల్లో ఉన్న రైతులు, న్యాయవాదులతో సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న భూసేకరణకు అందరూ సహకరించాలని కోరారు. నిబంధనల మేరకు భూ ములు సేకరించి రైతులకు పరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతుల భూసమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో స్వర్ణలత తదితరు లు పాల్గొన్నారు. 

రైతువేదికల నిర్మాణం చేపట్టాలి

జిల్లాలోని అన్ని క్లస్టర్లల్లో రైతువేదికల నిర్మాణాన్ని ప్రారంభించాలని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. మంగళవారం జి ల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఇంజినీర్లతో ఏ ర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జి ల్లాలో 88 క్లస్టర్లు ఉన్నాయని, రైతువేదికల నిర్మాణంపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు. వేదికల నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. పనులకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సూచించారు.  పను ల పూర్తిపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు. సమావేశంలో మిష న్‌ భగీరథ ఈఈ వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


logo