సోమవారం 06 జూలై 2020
Mahabubnagar - Jun 04, 2020 , 02:27:33

జక్లేర్‌-మక్తల్‌ మధ్య పూర్తయిన లైన్‌

జక్లేర్‌-మక్తల్‌ మధ్య పూర్తయిన లైన్‌

  • నేడు పరిశీలించనున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు
  • త్వరలో కృష్ణ వరకు పనులు  

 మక్తల్‌ రూరల్‌ : ఎట్టకేలకు మక్తల్‌ రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నిజాం కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న దేవరకద్ర-మునీరాబాద్‌ రైల్వే పనులు పూర్తి కావడంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనున్నది. గురువారం ట్రయల్న్‌ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మక్తల్‌ పట్టణానికి 2 కి.మీ. దూరంలో రైల్వే స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసుకున్నది. 2012 ఏడాదిలో రూ. 250 కోట్లతో ఈ రైల్వే పనులు ప్రారంభమయ్యాయి. రైల్వే లైన్‌ నిర్మాణం కోసం మక్తల్‌, మాగనూర్‌ మండలాల్లో భూ సేకరణకు అడ్డంకులు తలెత్తడంతో పనులు నత్తనడకన కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి విడుతగా దేవరకద్ర నుంచి మరికల్‌ మీదుగా జక్లేర్‌ వరకు లైన్‌ పనులు పూర్తయ్యాయి. గతేడాది జక్లేర్‌ స్టేషన్‌ వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్రస్తుతం జక్లేర్‌-మక్తల్‌ మధ్య 12 కి.మీ. రైల్వే లైన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రయల్న్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 


logo