మంగళవారం 07 జూలై 2020
Mahabubnagar - Jun 04, 2020 , 02:25:15

అమిస్తాపూర్‌లో వృద్ధురాలికి పాజిటివ్‌

అమిస్తాపూర్‌లో  వృద్ధురాలికి పాజిటివ్‌

  • ఎస్‌వీఎస్‌ క్వారంటైన్‌కు  తరలింపు

భూత్పూర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. భూ త్పూరు మున్సిపాలిటీలోని 5వ వార్డుకు చెందిన వృద్ధురాలికి రక్త పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. మే 30వ తేదీన కరోనా సోకిన వ్యక్తి తల్లే ఈ వృద్ధురాలు. ఆమెను జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్‌ దవాఖానలో ఉన్న క్వారంటైన్‌లో ఉంచారు. గురువారం ఆమెను గాంధీ దవాఖానకు తరలించనున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆమె కొడుకు క్వారంటైన్‌లో ఉన్నాడు. 


logo