సోమవారం 06 జూలై 2020
Mahabubnagar - Jun 04, 2020 , 02:23:10

కొనసాగుతున్న పారిశుధ్య వారోత్సవాలు

కొనసాగుతున్న పారిశుధ్య వారోత్సవాలు

  •  8వ తేదీ వరకు కార్యక్రమాలు
  •   గ్రామాల్లో ముమ్మరంగా పనులు 
  • దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

పల్లెల్లో స్వచ్ఛత బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పల్లెప్రగతి మొదటి, రెండో విడుత కార్యక్రమాలు నిర్వహించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో గ్రామాల అభివృద్ధికి నడుం కట్టారు. స్థాయిని మరిచి అందరూ సమిష్టిగా శ్రమదానం, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల ఏర్పాటు, రోడ్లను చదును చేయడం, నీళ్ల ట్యాంకులు శుభ్రపర్చడంతోపాటు పారిశుధ్య పనులు చేపట్టారు. దీంతో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దబడ్డాయి. ఇదే స్ఫూర్తితో జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు పారిశుధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని 1692 గ్రామాల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పారిశుధ్య పనులు చేపట్టడం, పాడుబడిన ఇండ్లను తొలగించడంతోపాటు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. 

- మహబూబ్‌నగర్‌ ప్రతినిధి

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి : రెండు విడుతల్లో జరిగిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టింది. గతంలో కనీ సం డ్రైనేజీలు శుభ్రం చేయని కొన్ని గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు పారిశుధ్యం పరిమళిస్తున్నది. గ్రామాల అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యంగా సర్కార్‌ భావిస్తున్నది. ‘గతంలో ము రుగు కాలువలు శుభ్రం కాలేదు.. చెత్తకుప్పలను ఎత్తేయలేదు.. పచ్చదనం పెంపొందించలేదు.. వంగిన స్తంభాలను సరిచేయలేదు.. శ్మశాన వాటికల స్థల సేకరణ చేపట్టలేదు..’ కానీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు తో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. పల్లె ‘ప్రగతి’ బాట పట్టింది. ఉమ్మడి జిల్లాలోని 1692 గ్రా మాల్లో గతంలో జరగని అభివృద్ధి పల్లెప్రగతితో సాధ్యమైం ది. సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు అన్న స్థాయిని పక్కనబెట్టి అంతా గ్రామస్తులతో కలిసికట్టుగా ఊరికోసం శ్రమదానం చేశారు. పారిశుధ్యలోపంతో ఇన్నాళ్లూ అవస్థలు పడిన గ్రామాల్లో ఇప్పుడు పరిశుభ్ర వా తావరణం కనిపిస్తోంది. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం పెంపొందించేందుకు.., దోమల నివారణకు ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. 

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు..

పల్లెల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి చూపించాలని సీఎం కేసీఆర్‌ భావించారు. ఈ ఈ తరుణంలో గతేడాది సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు నెల రోజుల పాటు గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇది విజయవంతం కావడంతో ఈ ఏడాది జనవరి 2 నుంచి 12వ తూదీ వరకు రెండో వి డుత పల్లెప్రగతి చేపట్టారు. రెండు విడుతల్లో ఆయా గ్రా మాల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, రోడ్లను చ దును చేయడం, స్కూళ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, సబ్‌ సెంటర్లులాంటి ప్రభుత్వ కార్యాలయా ల సముదాయాలతో పాటు నీళ్ల ట్యాంకులను శుభ్రపర్చడం, మురుగు కాల్వల్లో బ్లీచింగ్‌ చల్లడంలాంటి పనులు చేపట్టారు. గ్రామాల్లో పిచ్చి మొ క్కల తొలగింపు, పనిచేయని బోర్లను మూసేయ డం, పురాతన పాడుబడిన బావులు పూడ్చడం.. శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులకు స్థలాల సేకరణ లాంటి పలు పనులను గుర్తించి పరిష్కరించారు. గ్రామాల్లోని సమస్యలకు అధికారులు వి ముక్తి కల్పించారు.

జనాభా ఆధారంగా అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వే ళ.. పారిశుధ్యం పడకేయకుండా ప్రభుత్వం ముందస్తుగా పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టింది. ప్రస్తుతం దోమలు విజృంభించి డెంగీ ప్రబలే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమం ఉపయోగపడనున్నదని అధికారులు భావిస్తున్నారు. మురుగు కాలువలను శుభ్రం చేసి వృథా నీరు, వర్షపు నీటి ప్రవాహాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపడుతున్నారు. నీరు నిలువకుండా గుంతలను మొరంతో నింపుతున్నారు. మెయిన్‌ రోడ్లు, గ్రా మాల్లోని రోడ్లగుంతలను పూడ్చేస్తున్నారు. నీటి పైపులైన్ల లీకేజీలను గుర్తించి వాటిని సరి చేయిస్తున్నారు. ఓవర్‌ హెడ్‌, భూగర్భ నీటి ట్యాంకులు, సిమెంట్‌ ట్యాంకులు, మెటల్‌ డ్రమ్ములు, మట్టి గంగాళాలు, వాటర్‌ హార్వెస్టింగ్‌ ట్యాంకుల్లో దోమల లార్వాలను నాశనం చేసేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 


logo