శుక్రవారం 10 జూలై 2020
Mahabubnagar - Jun 03, 2020 , 04:13:16

పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రుల శంకుస్థాపన

పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రుల శంకుస్థాపన

మూసాపేట/అడ్డాకుల: మూసాపేట, అడ్డాకుల మండలంలో మంగళవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొని ప్రా రంభించారు. జానంపేటలో నిర్మించిన వ్యవసాయ శాఖ మార్కెట్‌ గోదాంను ప్రా రంభించడంతోపాటు, డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, జెడ్పీహెచ్‌ఎస్‌లో అదనపు గదుల నిర్మాణాలకు భూమిపూజ చేశారు.  మూసాపేట మండల కేంద్రంలో నిర్మించిన ఎమ్మార్సీ  భవనం ప్రారంభం, జెడ్పీహెచ్‌ఎస్‌లో అదన పు గదుల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అడ్డాకుల మండలంలోని రాచాలలో రూ.15లక్షలతో రైతు వేదిక, రూ.50 లక్షలతో అదనపు తరగతి గదులు, బలీదుపల్లి పెద్ద వాగులో రూ.4.66 కోట్లతో చెక్‌డ్యాం, కన్మనూరు శివారులోని పెద్దవాగులో 4.66 కోట్లతో చెక్‌డ్యాంలకు శంకుస్థాపనలు చేశారు.


logo