మంగళవారం 07 జూలై 2020
Mahabubnagar - Jun 03, 2020 , 04:08:51

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదాం

 జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదాం

  • అమరుల త్యాగాలు వెలకట్టలేనివి..
  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • పాలమూరులో అమరుల స్థూపం వద్ద నివాళులర్పించిన మంత్రి 

ప్రభుత్వం ప్రతి పనినీ పారదర్శకంగా చేపట్టి పక్కా ప్రణాళికతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్ర అవతరణ దినో త్సవం సందర్భంగా మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌, క్లాక్‌టవర్‌ సమీపంలోని అమరుల స్థూపం వద్ద జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి పుష్పగుచ్ఛం ఉంచి నివా ళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అమరుల త్యాగాలను మంత్రి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు యావత్తు తెలంగాణను ఏకతాటిపైకి సీఎం కేసీఆర్‌ తీసు కొచ్చారని ఆయన గుర్తు చేశారు. 

 మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతుందని, దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధిని గమనిస్తుందని, ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అడుగులు వేస్తుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఎన్నో వ్యథలు.. ప్రాణత్యాగాలు.. ఎందరో మహానుభావులు నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు.. ఇలా అందరి త్యాగఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించిందని, అంత ఆషామాషీగా వచ్చిన తెలంగాణ కాదని తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, క్లాక్‌టవర్‌లోని అమరవీరుల స్థూపాల వద్ద ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావులతో కలిసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీ య జెండాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు.

అమరవీరుల కుటుంబ స భ్యులను మంత్రి శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించా రు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ఆనాడు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌ యావత్తు తెలంగాణ ప్రజలను ఒ క్క తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తు చేసుకున్నారు. అందరి గుండెల్లో తెలంగాణ వస్తది.. మనం ఐక్యంగా ముందుకు సాగుదాం.. అని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుం డా పోరాడారన్నారు. నాడు జరిగిన పోరాటంలో ఎం దరో ప్రాణత్యాగాలు చేశారన్నారు. అమరవీరులు, వారి కుటుంబసభ్యులను స్మరించుకుని కంటతడి పెట్టారు. సీఎం కేసీఆర్‌ వారి త్యాగాలను వృథా కానివ్వకుండా బంగారు తెలంగాణ దిశగా ముందుకుసాగుతున్నారని చెప్పారు. గడిచిన ఆరేండ్లల్లో రాష్ట్రం ఏ మేరకు అభివృద్ధి చెందిదో ఒక్కసారి మీ గుండెలను అడగాలని పేర్కొన్నా రు. అభివృద్ధి అంటే ఇది.. సం క్షేమం అంటే ఇలా.. అనే స్థాయిలో ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు.

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మనమంద రం పాటుపడుదామని పిలుపునిచ్చారు. గురుకుల పాఠశాలల ద్వారా నిరుపేద బిడ్డలకు కూడా ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు. గురుకుల విద్యార్థులు ఎన్నో విజయాలను సాధిస్తూ ప్రైవేట్‌ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారని చెప్పారు. మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఎలాంటి దిగులు అవసరం లే దని.., అదంతా సీఎం కేసీఆర్‌ తన భుజాన వేసుకుని నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. 

అభివృద్ధిలో గతానికి.., నేటికి ఎంతో తేడా ఉందని, మాయమాటలు చెప్పి కాలం వెల్లదీసే మోసగాళ్ల మాటలను ప్రజలు నమ్మకూడదని కోరారు. ప్రభుత్వం రూ.5 వేల కోట్ల మత్స్య సంపదను సృష్టించి మత్స్యకారులకు జీవనోపాధి కల్పించిందని చెప్పారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మహిళా సంఘాల ద్వారా రుణాలిచ్చేందుకు రూ.1000 కోట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. 

పుట్టుక.. చావు తథ్యం

మనం అనుకున్నా.. అనుకోకపోయినా పుట్టుక.. చా వు జరుగుతాయని, జీవించినంత కాలం ఏం చేశామన్న దే ముఖ్యమని మంత్రి తెలిపారు. మనం భూమిపై లేకపోయినా.. మనం చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. స్వార్థం కోసం కొందరు రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతారని, వారిని ప్ర జలు దరిచేరనీయొద్దన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ ఎదుగుదల కోసం తెలంగాణ సర్కార్‌ ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. కా ర్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి,  ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి, రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, ఎస్పీ రెమారాజేశ్వరి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, గ్రంథాలయ సంస్థ జి ల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


logo