శనివారం 06 జూన్ 2020
Mahabubnagar - May 24, 2020 , 02:33:58

కళ తప్పిన కల్యాణం

కళ తప్పిన కల్యాణం

ఓవైపు కరోనా భూతం

 మరోవైపు తక్కువ ముహూర్తాలు..

 వేసవిలో కనిపించని పెండ్లిసందడి

 అనుబంధ రంగాలపై భారీ దెబ్బ

 లాక్‌డౌన్‌తో మారిన కల్యాణ శోభ..

 అనుమతులు తప్పనిసరి అంటున్న అధికారుల

ఆత్మకూరు : వివాహాది శుభకార్యాలకు అనుసంధానంగా ఉండే రం గాలపై కరోనా ప్రభావం పడింది. కల్యాణ మండపాలు, డీజేలు, బ్యాం డ్‌ బాజా, సన్నాయి మేళం, క్యాటరింగ్‌, వంటలు వండే వారు, మేకప్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, టెంట్‌హౌస్‌, పెళ్లి బట్టలు, దర్జీలు, ఫొటోలు, వీడియోగ్రాఫర్లు, పురోహితులు, బంగారం, బట్టలు, పూలు, పెళ్లిపందిరి, కూరగాయల రైతులు, చికెన్‌, మటన్‌ వ్యాపారులు, వాహనాలు కిరాయికి ఇచ్చేవారు, కుమ్మరి, చాకలి, మంగళి వారు ఇలా చెప్పుకుం టూ పోతే చాలామంది ఉపాధిపై కరోనా దెబ్బకొంటిందనే చెప్పాలి. 

హంగూ, ఆర్భాటాలు లేవు..

వివాహాలు చేసుకునేవారికి కరోనా విపరీతమైన కష్టాలు తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్‌ కంటే ముందే నిర్ధారించుకున్న పెండ్లిళ్లను చాలామం ది వాయిదా వేసుకున్నారు. వేలల్లో డబ్బులు అడ్వాన్స్‌గా చెల్లించి క ల్యాణ మండపాలను బుక్‌ చేసుకొని మరీ క్యాన్సల్‌ చేసుకున్నారు. ఏ ప్రిల్‌ చివరి నుంచి మే నెలల్లో పలు ముహూర్తాలు కలిసిరాగా కొంతమంది ఇళ్లకే పరిమితమై పెళ్లితంతు కానిచ్చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం కలెక్టర్‌, తాసిల్దార్ల అనుమతి తప్పనిసరి తీసుకుని హంగూ, ఆ ర్భాటం లేకుండా సాదాసీదాగా వివాహాలు చేసుకుంటున్నారు. తక్కు వ మంది బంధువులతో పాటు నిబంధనల మేరకు వివాహాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెండ్లి నిర్వహణ కోసం చేసుకున్న ఏర్పాట్లు వంటివి సిద్ధంగా ఉన్నా కరోనా దెబ్బతో ఏమీ చేయలే ని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ముహూర్తం తేదీలను ఖరారు చేసుకున్నవారు 20 మంది వచ్చినా సరే అంటూ అనుమతుల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 

ఈ ఏడాది ముహూర్తాలు.. మూఢాలు

  •  మే నెలలో ఇప్పటికే కొన్ని ముహూర్తాలు ముగిసిపోగా 24, 29వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా అతి తక్కువశాతం వివాహాలు జరగనున్నాయి. 
  •  మే 30 నుంచి జూన్‌ 9 వరకు పది రోజుల పాటు మూఢం కారణంగా శుభకార్యాలు ఉండవు. 
  •  జూన్‌ 10, 11 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. 
  •  జూన్‌ 22 నుంచి జూలై 20 వరకు నెల రోజుల పాటు ఆషాఢమాసం.. శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు.
  •  జూలై 23, 24, 25వ తేదీలతో పాటు ఆగస్టు 2, 7, 8, 14వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. కానీ ఈ సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చాలా మంది శుభకార్యాలు చేసుకోవడానికి ఆసక్తి కనబరిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 
  •  ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు భాద్రపదం, శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు. 
  •  సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 16వ తేదీ వరకు నెల రోజులు అధిక అశ్వీయుజ మాసం, శూన్యమాసం కావడంతో మంచి ముహూర్తాలు లేవు. 
  •  అక్టోబర్‌ 21, 28, 29, 30, నవంబర్‌ 6, 11 నుంచి డిసెంబర్‌ 6 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. 
  •  డిసెంబర్‌, జనవరిలో సంక్రాంతి కారణంగా ముహూర్తాలు ఉన్నా కొందరు శుభకార్యాలు చేసుకోవడానికి ఆసక్తి చూపరు. 

  • మంచి ముహూర్తాలు తక్కువే..

ఈ ఏడాది పెండ్లిళ్లపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. దీనికి తోడు గురు, శుక్ర మూఢాలు, అధిక అశ్వీయుజ మాసం, ఆషాఢం, భాద్రపదం కారణంగా శుభకార్యాలు చాలా తక్కువ. పురోహితులతో పాటు వివాహ కార్యక్రమాలతో సంబంధం ఉన్న అన్ని పనుల వారికి గడ్డు పరిస్థితులు వచ్చాయి. మునుపెన్నడూ లేని విధంగా ఉపాధి దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. 

- జ్యోషి గుండాచారి, పురోహితుడు, ఆత్మకూరు

అనుమతి తప్పనిసరి..

ప్రభుత్వ నిబంధనల మేరకు వివాహాలు చేసుకోవచ్చు. పెండ్లి తరఫు కుటుంబీకులు రె వెన్యూ కార్యాలయంలో తప్పనిసరిగా దరఖా స్తు చేసుకోవాలి. అనుమతి తీసుకున్న వారు కే వలం 20 మందితో భౌతిక దూరం పాటిస్తూ కార్యాన్ని నిర్వహించుకోవాలి. బ్యాండ్‌ బాజా పెట్టుకోవద్దు. బరాత్‌లు నిర్వహించుకోరాదు. సామూహిక భోజ నాలు పెట్టకూడదు. ఇవ్వన్నీ పాటిస్తేనే అనుమతులు ఇస్తున్నాం. 

- జేకే మోహన్‌, తాసిల్దార్‌, ఆత్మకూరు

ఈ సీజన్‌ చాలా నష్టపోయాం..

ఈ ఏడాది పెండ్లిలన్నీ వాయిదా పడుతుండడంతో ఈ సీజన్‌లో చాలా నష్టపోయాం. చా లామంది క్యాటరింగ్‌ ఆర్డర్లు చెప్పి క్యాన్సల్‌ చే సుకున్నారు. అందరూ ఇండ్లవద్దే కొద్దిమంది తో పెండ్లిళ్లు చేసుకుంటున్నారు. 20, 30 మం దికి వంట వండేందుకు ఎవ్వరూ పిలవడం లే దు. పనుల్లేక, వ్యాపారాలు నడవక ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాం. వివాహాలు జరిగినా వంటలవాళ్లను పిలుస్తారో లేదో తెలియడం లేదు. 

- సద్దల నాగరాజు, మాస్టర్‌కుక్‌ క్యాటరింగ్స్‌, ఆత్మకూరు


logo