శనివారం 06 జూన్ 2020
Mahabubnagar - May 22, 2020 , 01:35:59

అబ్బుర పర్చేలా.. మినీ శిల్పారామం

అబ్బుర పర్చేలా.. మినీ శిల్పారామం

 పాలమూరును సుందరంగా తీర్చిదిద్దుతాం

 రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలి

 క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

  మహబూబ్‌నగర్‌ : జిల్లా కేంద్రంలో జరిగే అభివృద్ధి పనులు అద్భుతంగా ఉండాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ పట్టణం లో నిర్మిస్తున్న మినీ శిల్పారామం, మినీ ట్యాంక్‌బండ్‌ పనుల అభివృద్ధిపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులతో గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పాలమూరులో చిన్నారుల కోసం ఆధునిక టాయ్‌ ట్రైన్‌ ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని, అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి  కేటీఆర్‌  సూచనల మేరకు దేశీయ, విదేశీ సందర్శకులను ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు. పాలమూరును సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. మినీ శిల్పారామంలో నిర్వహించే కార్యక్రమాలు, కన్వెన్షన్‌ సెంటర్‌ స్టాళ్లు, ఫుడ్‌కోర్టులతోపాటు మినీ ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంటర్‌టైన్మెంట్‌ జోన్ల అభివృద్ధి, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా డిజైన్లు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన నివేదిక వారం రోజుల్లోగా రూపొందించి అందించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌, టూరిజం శాఖ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శంకర్‌రెడ్డి, కన్సల్టెంట్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 logo