మంగళవారం 07 జూలై 2020
Mahabubnagar - May 12, 2020 , 02:09:12

ప్రతి ఎకరాకూ సాగునీరందించేందుకు కృషి

ప్రతి ఎకరాకూ సాగునీరందించేందుకు కృషి

దేవరకద్ర రూరల్‌/మహబూబ్‌నగర్‌ : ని యోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. దే వరకద్ర మండలంలోని చిన్నరాజమూర్‌ గ్రా మ శివారులో ఉన్న వాగుకు రూ.4.97 కోట్ల తో నిర్మిస్తున్న చెక్‌డ్యాంకు సోమవారం ఎమ్మె ల్యే భూమి పూజ చేశారు. కోయిల్‌సాగర్‌ కుడి, ఎడమ కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు సూచించారు. మ హబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో ఎమ్మెల్మే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో ఏర్పాటు చేసిన సమావేశంలో క లెక్టర్‌ మాట్లాడారు. ఎడమ కాలువ కింద భూ ములు కోల్పోయిన వారికి త్వరగా అవార్డుల ను పాస్‌ చేయాలన్నారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రాజోలు నుంచి ఎగ్‌మార్క్‌ ఎప్పుడు ప్రారంభిస్తారని కలెక్టర్‌ను అడిగారు. సీసీకుం ట, దేవరకద్ర, కోయిల్‌కొండ మండలాలకు సంబంధించిన భూ సర్వే నిర్వహించాలన్నా రు. ఎడమ కాలువ పనులను త్వరగా పూర్తి చే యాలని, వర్షాకాలం ప్రారంభం అయితే పను లు చేపట్టడానికి ఇబ్బంది ఏర్పడుతుందన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, అదనపు కలెక్టర్లు సీతారామారావు, మోహన్‌లాల్‌, ఆర్డీవో శ్రీనివాసులు, స ర్పంచ్‌ జయమ్మ, వైస్‌ ఎంపీపీ సుజాత, పీఏసీసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ బాలాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.


logo