సోమవారం 13 జూలై 2020
Mahabubnagar - May 07, 2020 , 02:22:27

ఘనంగా ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

  • కేక్‌ కట్‌చేసి సంబురాలు చేసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు
  • దవాఖానల్లో పండ్లు, గ్రామాల్లో మాస్క్‌ల పంపిణీ

నారాయపేట టౌన్‌/నారాయణపేట రూరల్‌/మరికల్‌/ధన్వాడ/కోయిలకొండ/దామరగిద్ద: నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పేట పట్టణంలో కేక్‌కట్‌ చేసి దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో నిత్యావసర సరుకులు అందజేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణ్‌ భట్టడ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చెన్నారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట మండలంలోని జాజాపూర్‌లో సర్పంచ్‌ సుగంధమ్మ, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ అంజలి ఉపాధి హామీ కూలీల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. కూలీలకు మాస్కులను పంపిణీ చేశారు. మరికల్‌ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జెడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ కేక్‌ కట్‌ చేసి పండ్లను పంపిణీ చేశారు. అలాగే పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి వీరభద్రేశ్వర ఆలయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలో మాజీ సర్పంచ్‌ భీమయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం మహిళలకు, శరణప్ప, ఆశన్న సొంత ఖర్చుతో మండల పోలీసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎంపీపీ నర్సప్ప తదితరులు పాల్గొన్నారు. కోయిలకొండల మండల కేంద్రంలో ఆదిఆంజనేయస్వామి ఆలయంలో ఎంపీపీ శశికళ భీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కృష్ణయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్‌కట్‌ చేశారు. అనంతరం దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు మాస్కులు పంపిణీ చేశారు. ధన్వాడ మండలం  ఎంనోన్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కేక్‌ను కట్‌ చేశారు. సర్పంచ్‌ భారతి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, సచిన్‌, హన్మంతు పాల్గొన్నారు.logo