ఆదివారం 07 జూన్ 2020
Mahabubnagar - Apr 06, 2020 , 02:00:09

సంక్షిప్త సమాచారం..

సంక్షిప్త సమాచారం..

కరోనాపై పోరులో యువక మండలి

మరికల్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులకు సహాయంగా మరికల్‌ యువక మండలి సభ్యులు నిత్యం 30 మంది ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు కలిసి పని చేస్తున్నారు. యువక మండలి సభ్యులతో పాటు టీఆర్‌ఎస్‌ కార్యకర్త రవికుమార్‌ ప్రత్యేకంగా సెక్యూరిటీ డ్రెస్‌ను ధరించి సేవలందిస్తున్నారు.

కొత్తగంజ్‌లో విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : పట్టణ కేంద్రంలోని కొత్తగంజ్‌లో విద్యుత్‌ షాక్‌కు కారణమవుతున్న కరెంటు స్తంభాలను అధికారులు మార్చారు. ఈ ప నులను మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటిగణేశ్‌ స్వయంగా పరిశీలించి పనులు పూర్తి చేయించారు. 

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మల్దకల్‌ : మండలంలోని విఠలాపురం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేం ద్రాన్ని ఆదివారం సింగిల్‌ విండో అధ్యక్షుడు శేషంపల్లి తిమ్మారెడ్డి ప్రారంభిం చారు. రైతులు పండించిన పంటలను సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభు త్వం కొనుగోలు చేస్తుందన్నారు. 

ప్రజా చైతన్యం కోసం సైకిల్‌ యాత్ర

మూసాపేట : కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి మీ ఇల్లే శ్రీరామ రక్ష అని, ఇల్లు వదిలి ఎవరూ బయటకు రావద్దు అని సీనియర్‌ జర్నలిస్టు గౌరి శంకర్‌ ప్రజలకు సూచించారు. కరోనా వ్యాధిపై ప్రజా చైతన్యం కోసం ఫిబ్రవరి 5వ తేదీన మేడారం జాతరలో చేపట్టిన సైకిల్‌ యాత్రతో ఆయన ఆదివారం మూసాపేట తాసిల్దార్‌ కార్యాలయానికి చేరుకొని అక్కడ బస చేశారు. ఆయనకు తాసిల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ మానస, వీఆర్వో వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ డీ బాల్‌రాజ్‌లు స్వాగతం ఫలికారు.

సీసీరోడ్డుకు భూమిపూజ

మదనాపురం : మండలంలోని అజ్జకొల్లు గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల నుంచి మంజూరైన రూ.7.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి జెడ్పీటీసీ కృష్ణయ్య ఆదివారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.  

కొనసాగుతున్న పీఠాధిపతి మౌనదీక్ష

చిన్నచింతకుంట : మండల పరిధిలోని బండర్‌పల్లి గ్రామ సమీపంలోని దత్త వైకుంఠపురం అవధూత రామకృష్ణానంద గురుస్వామి చేపట్టిన మౌన దీక్ష వారం రోజులుగా కొనసాగుతోంది.

పంచాయతీ కార్మికులకు చికెన్‌ పంపిణీ

జడ్చర్ల : జడ్చర్ల గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మాజీ వార్డు సభ్యుడు విజయ్‌కుమార్‌ ఉప సర్పంచ్‌ డీ శ్రీను ఆదివారం చికెన్‌ను పంపిణీ చేశారు. 

ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో మాంసం మార్కెట్‌

జడ్చర్ల టౌన్‌ : బాదేపల్లి మాంసం మార్కెట్‌లో రద్దీ దృష్ట్యా ఆదివారం బాదేపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలోకి మాంసం మార్కెట్‌ను తరలించారు. బస్టాండ్‌ ప్రాంగణంలో కొనుగోలుదారులు నిర్ణీత దూరాన్ని పాటించేలా పురపాలిక కమిషనర్‌ సునీత పర్యవేక్షణలో అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లో కొనుగోలు దారులు నిర్ణీత దూరాన్ని పాటించేలా కావేరమ్మపేట పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు.

15న జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం 

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : ఈ నెల 15వ తేదీన జిల్లా పరిషత్‌ స మావేశ మందిరంలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఖిల్లాఘణపురం : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కృష్ణనాయక్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి తెలిపారు. అల్లమాయిపల్లిలో సోమవారం మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించ నున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు పరిశీలించారు. 

పప్పుశనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

వడ్డేపల్లి : మండలంలోని కొంకలలో సహకార సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ వరలక్ష్మి ఆధ్వర్యంలో పఫ్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, సీఈవో మద్దిలేటి, నాగేశ్వర్‌ రెడ్డి, యనుముల నాగరాజు, సూరిబాబు, యోగిరెడ్డి రైతులు పాల్గొన్నారు.

నేడు జడ్చర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

జడ్చర్ల : మండలంలోని గంగాపూర్‌ రోడ్డులోని పత్తి మార్కెట్‌ యార్డులో సోమవారం ఉదయం 10 గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నట్లు జడ్చర్ల మండల వ్యవసాయశాఖ అధికారి రాంపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

పీఎంజేడీవై డబ్బుల కోసం ఉపాధి కూలీల క్యూ 

కోడేరు : లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకం (పీఎంజేడీవై)  కింద రూ.500లను ప్రజల ఖాతాలో జమ చేసింది. ఈ డబ్బుల కోసం కోడేరులో ఉపాధి కూలీలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. 

వీపనగండ్ల తాసిల్దార్‌గా యేసయ్య

వీపనగండ్ల : మండల తాసిల్ద్దార్‌గా పి.యేసయ్య ఆదివారం బాధ్యతలు స్వీ కరించారు. వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో ఏఎస్‌వోగా పని చేస్తూ పదోన్నతిపై వీపనగండ్ల తాసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించడం పట్ల సంతోషంగా ఉందన్నా రు. ఇన్‌చార్జి తాసిల్దార్‌ పాండు నాయక్‌ యేసయ్యకు బాధ్యతలు అప్పగించారు. 

వలస కూలీలకు వైద్యపరీక్షలు

కోస్గి : కోస్గి మండలం తొగాపూర్‌, హకీంపేట్‌ గ్రామాలకు చేరుకున్న వలస కూలీలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయించినట్లు మండల ప్రత్యేకాధికారి కృష్ణమాచారి ఆదివారం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుకర్‌రావు, జెడ్పీటీసీ ప్రకాశ్‌ రెడ్డిలు పాల్గొన్నారు.

రైతు బజార్‌ను పరిశీలించిన మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌

నారాయణపేట టౌన్‌ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏ ర్పాటు చేసిన రైతుబజార్‌ను ఆదివారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణ్‌ భట్టడ్‌ పరిశీలించారు. 

నిబంధనలు పాటించాలి : శ్రీశైలం ఈవో

శ్రీశైలం : కరోనా వైరస్‌ లక్షణాలు సోకకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న ని బంధనలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని శ్రీశైల దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు అన్నారు. కరోనా మహమ్మారిని తిప్పికొట్టేందుకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని కోరారు. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పోలీస్‌, ఆరోగ్యశాఖ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.


logo