శుక్రవారం 05 జూన్ 2020
Mahabubnagar - Mar 17, 2020 , 02:44:07

ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు
  • అసెంబ్లీలో కేక్‌కట్‌ చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • శుభాకాంక్షలు తెలిసిన ఉమ్మడి ఎమ్మెల్యేలు
  • జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించిన నేతలు
  • ఆయా మండలాల్లో కేక్‌లు కట్‌ చేసిన అభిమానులు

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ/విద్యావిభాగం/మున్సిపాలిటీ/రూరల్‌/వైద్యవిభాగం/కోయిలకొండ/హన్వాడ : నిరంతర శ్రామికుడు, అభివృద్ధి దిక్సూచి ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జన్మదిన వేడుకలను సో మవారం మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, రా జేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మం త్రికి ఎమ్మెల్యేలు కేక్‌ తినిపించి జన్మదిన శు భాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కా ర్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహు లు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌లు కేక్‌ కట్‌ చేశారు. మార్కెట్‌ యార్డులో చైర్మన్‌ కాడం ఆంజనేయు లు ఆధ్వర్యంలో దడవాయి, హమాలీ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, ఆనంద్‌గౌడ్‌, కట్టా రవికిషన్‌రెడ్డి, శాంతయ్యయాదవ్‌, రాములు పాల్గొన్నారు. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీలో టీఆర్‌ఎస్‌వీ జి ల్లా కోఆర్డినేటర్‌, పీయూ ఇంచార్జి కుర్వ పల్ల య్య, మధు, భానుకుమార్‌, రామ్మోహన్‌, తిరుమల్లేశ్‌, రవి, మహేశ్‌, రామకృష్ణ, కిరణ్‌, సత్యం, జయరా జ్‌లు కేక్‌ కట్‌ చేశారు. అదేవిధంగా కా లేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పా ఠశాలలో అ ల్‌ మదీనా కాలేజ్‌ జనర ల్‌ సెక్రటరీ ఇంతియాజ్‌ ఇ సాక్‌ మొక్కలు నాటారు. అలాగే, మున్సిపల్‌ ఎలక్ట్రీషియన్స్‌ ఆ ధ్వర్యంలో ఫ్లోర్‌ లీడర్‌ షబ్బీర్‌ అహ్మద్‌, డి ప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కట్టా రవికిషన్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్‌, గోవిందు, రషాద్‌ఖాన్‌, మోసీన్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, ఎంపీపీ సుధాశ్రీ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. కోటకదిర గ్రామంలో ఎంపీపీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ 10వ తరగతి విద్యార్థులకు అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ అనిత, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్‌, ఆంజనేయులు, మల్లికార్జున్‌రెడ్డి, రాం చంద్రయ్య, కృష్ణయ్యగౌడ్‌, కృష్ణయ్య, రాఘవేందర్‌గౌడ్‌, పాండురంగారెడ్డి పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌ అనాథాశ్రమంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో రమేశ్‌, శరత్‌, చంద్రగౌడ్‌, రవీందర్‌ నాయక్‌, ప్రతాప్‌ నాయక్‌, నాగేశ్‌, రవినాయక్‌, సంతోష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కోయిలకొండ మండల కేం ద్రంలో గౌడ సంఘం నాయకులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు పవన్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా హన్వాడ మండలంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్‌రాజ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్‌, మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ కృష్ణయ్యగౌడ్‌, అనంతరెడ్డి, రాము, చెన్నయ్య, బాలాగౌడ్‌, వెంకన్న, చెన్నయ్య, స త్యం, కొండా బాలయ్య, రాఘవేంద్ర, శ్రీనివాసులు, చెన్నయ తదితరులు పాల్గొన్నారు.logo