శుక్రవారం 05 జూన్ 2020
Mahabubnagar - Mar 08, 2020 , 01:06:02

వందశాతం ఫలితాలు సాధించాలి

వందశాతం ఫలితాలు సాధించాలి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : విద్యార్థులకు వేదిక్‌ మ్యాథమెటిక్స్‌ బోధించడం వల్ల మంచి ఫలితాలను రా బట్టవచ్చని  కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. శనివారం  అంబేద్కర్‌ కళాభవనంలో సరోజిని స్మార్ట్‌ లెర్నింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యం లో వేదిక్‌ మ్యాథమెటిక్స్‌ 3వ సంవత్సర వార్షికోత్సవా న్ని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని 15 కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులకు గణితంపై ఉన్న భయాన్ని పోగొట్టి  పట్టు సాధించవచ్చన్నారు.  ఈ కార్యక్రమం ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మండల స్థాయిలో ఉన్న జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో వేదిక్‌ మ్యాథమెటిక్స్‌ను ప్రా రంభించాలని సూచించారు. వేదిక్‌ మ్యాథమెటిక్స్‌ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను మెమెంటోలను కలెక్టర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వి ద్యాశాఖాధికారి ఉషారాణి, సరోజిని స్మార్ట్‌ లర్నింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్‌ మురహరి, అశ్విన్‌కుమార్‌, స్నేహ తదితరులు పాల్గొన్నారు.


బాధ్యతగా పనిచేయండి 

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ తన చాంబర్‌లో 9 మందికి మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ను చేయడంతో పా టు మరింత మందికి కారుణ్యనియామకాల ప్రక్రియను పరిశీలించారు. ఈ క్రమంలో ముగ్గురికి ఇన్‌వాలిడేషన్‌ ఆమోదం తెలిపారు. 5మందికి కారుణ్య నియామపత్రాలను అందజేశారు. 


మహిళలకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలి 

మహిళలకు ప్రత్యేక గౌరవం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావ్‌ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మయూరి పార్కులో డీఆర్‌వో స్వర్ణలత, వివిధ శాఖల మహిళా ఉద్యోగులను జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో గంగారెడ్డి, డీఎస్‌వో వనజాత, వివిధ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. 


logo