గురువారం 04 జూన్ 2020
Mahabubnagar - Mar 07, 2020 , 00:46:28

‘డబుల్‌' నిర్మాణాలు పూర్తి చేయండి

‘డబుల్‌' నిర్మాణాలు పూర్తి చేయండి

 మహబూబ్‌నగర్‌ రూరల్‌ : డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ మండలం దివిటిపల్లి గ్రామంలో ని ర్మించిన ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డబుల్‌ బెడ్రూం ఇండ్ల ని ర్మాణం నాణ్యతగా చేపట్టి అర్హులైన పేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పేదల కోసం నిర్మించే ఇండ్ల నిర్మాణంలో నాణ్యత కొరవడితే సహించేదిలేదన్నారు. ఇండ్ల ఆవరణలో మొక్కలు నాటి పెం చాలని సూచించారు. కాలనీలలో పచ్చదనం, పరిశుభ్ర త పెంచాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో చేపడుతున్న శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు పనులను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ జరీనాబేగం, ఆర్‌ఐ క్రాంతికుమార్‌గౌడ్‌, రాజీవ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అర్చన పాల్గొన్నారు.

గడువులోగా పనులు పూర్తి కావాలి 

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో దేవరకద్ర, హన్వాడ, కోయిలకొండ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన స మావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలలోగా గ్రామాలకు చేరుకు ని పల్లె ప్రగతి పనులను సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలని సూచించారు. అభివృద్ధి పనులపై నిర్ల క్ష్యం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా వ్యవహరించి పనుల్లో వే గం పెంచాలని సూచించారు. అలాగే, ఐదెకరాల కంటే తక్కువగా ఉన్న రైతులు కూరగాయలు, ఆకుకూరలతోపాటు వివిధ పంటలను పండించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో వెంకట్‌రెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో యాదయ్య, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 


logo