శుక్రవారం 05 జూన్ 2020
Mahabubnagar - Feb 27, 2020 , 03:54:30

టీడీఆర్‌ వద్దు.. నష్టపరిహారమే ముద్దు

టీడీఆర్‌ వద్దు.. నష్టపరిహారమే ముద్దు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: పట్టణంలో ప్రధాన విస్తరణలో నష్టపోతున్న వారికి టీడీఆర్‌ వద్దని, నష్టాపరిహారం చెల్లించాలని పట్టణ రహదారి విస్తరణ, ప్రజా సంక్షేమ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ అబ్దుల్‌ఖలీం, ఉపాధ్యాక్షుడు ధన్‌రాజ్‌ అన్నారు. బుధవారం రోడ్డు విస్తరణలో భాగంగా బంద్‌ చేపట్టారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అప్పన్నపల్లి నుంచి పీయూ వరకు 100 ఫీట్ల విస్తరణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. 100 ఫీట్ల విస్తరణలో నిర్మాణలు కోల్పుతున్నారని.. వారికి టీడీఆర్‌కు ఇవ్వకుండా, నష్టాపరిహారం ఇవ్వాలని కోరారు. ఇందులోనే డ్రైనేజీ ఫుట్‌పాత్‌ నిర్మించాలన్నారు. రోడ్డు విస్తరణతో పట్టణంమరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. అభివృద్ధిలో భాగస్వాములవుతామని తెలిపారు. కార్యక్రమంలో అయూబ్‌పాషా, గురుస్వామి, సత్యనారాయణ, అల్తాఫ్‌, గజీ, షరీఫ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.


logo