ఆదివారం 07 జూన్ 2020
Mahabubnagar - Feb 19, 2020 , 00:00:48

ప్రగతి పరుగులు

ప్రగతి పరుగులు

పట్టణ ప్రగతితో అభివృద్ధి పరుగులు పెట్టనున్నది. 24 నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు

  • 24 నుంచి పట్టణ ప్రగతి ప్రారంభం
  • పది రోజుల పాటు కార్యక్రమం
  • కలెక్టర్‌, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • నేడు జిల్లా కేంద్రంలోని వైట్‌ హౌస్‌లో సదస్సు
  • హాజరుకానున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె, ఎమ్మెల్యేలు

పట్టణ ప్రగతితో అభివృద్ధి పరుగులు పెట్టనున్నది. 24 నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని, ఇందుకోసం వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని వైట్‌ హౌస్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కమిషనర్లు హాజరుకానున్నారు. 

- మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ


మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : ఈనెల 11న నిర్వహించిన కలెక్టర్ల సమావేశం లో సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన మేరకు అన్ని మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈనెల 24 నుంచి 10 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సన్నద్ధంగా జిల్లా కేంద్రంలో పార్లమెంట్‌ స్థాయి పురపాలక సదస్సను చేశారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని వైట్‌హౌస్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు సదస్సు ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు ఒక ప్ర కటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎ మ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిల ర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, వార్డుల ప్రత్యేక అధికారు లు హాజరు కానున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. వార్డు కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని మున్సిపల్‌ పాలకవర్గాలకు తెలియజేయనున్నారు. పల్లెప్రగతి విజయవంతమైన నేపథ్యంలో పట్టణ ప్రగతి చేపడుతున్న దృష్ట్యా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. 


సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం 

పట్టణాలు ప్రగతి పథంలో పయనించేందుకు యం త్రాంగమంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించి జిల్లాల నుంచి కలెక్టర్లు, ప్రజాప్రతినిధు లు తరలివెళ్లారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ మోహన్‌లాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, మున్సిపల్‌ చైర్మన్లు కొరమోని నర్సింహులు, బస్వరాజ్‌గౌడ్‌ తదితరులు హాజరయ్యారు. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని సమావేశానికి హాజరైన పలువురు తెలిపారు. పట్టణాల్లో యువత, మహిళా, సీనియర్‌ సిటిజన్‌, పలువురితో కలిపి నాలుగు కమిటీలను వేసి ప్రతి కమిటీలో 15 మంది చొప్పున సభ్యులను ఉంచి వార్డుల అభివృద్ధి కోసం నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించినట్లు సమాచారం. 


మా వీధి-మా వాడ అనే ఆలోచన వార్డులలోని ప్రజలు వచ్చేలా వారిని ప్రోత్సహిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని వివరించినట్లు తెలిపారు. వార్డుల్లో అభివృద్ధి కోసం దాతలు ముందుకు వస్తే వారి సహకారం తీసుకొని సమస్యలను పరిష్కరించాలని సూచించినట్లు వివరించారు. వార్డుల్లోనూ హరితహారం, శ్మశానవాటిక, నీటి వసతి, డ్రైనేజీ సమస్యలు లేకుండా ప్రణాళికా బద్ధంగా పట్టణ ప్రగతికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారని అధికారులు వెల్లడించారు. ఏడాది, ఐదేండ్లకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకొని అందుకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికోసం శాయశక్తులా కృషి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించినట్లు వివరించారు. పల్లెల్లో పల్లెప్రగతి ఏ విధంగా విజయవంతమైందో ఇక పట్టణ ప్రగతి సైతం అంతకంటే బాగా సఫలమయ్యే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొంటున్నారు. 


logo