శనివారం 29 ఫిబ్రవరి 2020
చెట్లు నరికితే జైలుకే

చెట్లు నరికితే జైలుకే

Feb 14, 2020 , 03:39:15
PRINT
చెట్లు నరికితే జైలుకే

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఓ వైపు మొక్కలను నాటి పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతోంది. ఎక్కడ అవకాశం ఉన్నా మొక్కలు నాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అడవుల శాతం తగ్గిపోతున్న తరుణంలో మొక్కలు నాటి పచ్చదనం పెంచేందుకు తీవ్రమైన ఇబ్బందులను ఎదురొడ్డి ముందుకు సాగుతున్న పరిస్థితి ఉం ది. మరోవైపు అక్రమార్కులు మాత్రం యథేచ్ఛగా చెట్లు నరికేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్దేశమే పక్కదారి పడుతోంది. ఈ నేపథ్యంలో అడవుల సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రితో ఈ నెల 11న జరిగిన సమావేశంలో అడవుల సంరక్షణ, హరితహారం మొక్కలను కాపాడటం, ఇసుక అక్రమ రవాణాపై జిల్లా పాలనాధికారులకు దిశానిర్దేశం చేశారు.   కలెక్టర్‌ వెంకట్రావు ఈ అంశంపై ప్రత్యేక చర్యలను ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలోని రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖలను సమన్వయం చేస్తూ చెట్లు నరికివేయకుండా జాగ్రత్తలు తీసుకునడంతోపాటు అక్రమ ఇసుక దం దాపైనా నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. శాఖలను సమన్వయం చేస్తూ పక్కాగా వాల్టా చట్టాన్ని అమ లు చేస్తామని   ప్రకటించి అక్రమార్కుల గుండెల్లో గునపాలు దింపారు.  చెట్లు నరికినా, ఇసుక అక్రమ రవాణా చేసినా... భూమిని, నీటిని, చెట్లను కాపాడే వాల్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు

హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్క ను కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల నీటి ఇబ్బందులు ఉన్న త రుణంలో వాటర్‌ ట్యాంకర్ల ద్వారా ఎక్కడి నుంచి నీటిని తెచ్చి మొక్కలు ఎండిపోకుండా కాపా డుతున్నారు. జిల్లాలో 33శాతం మేర అడవులు ఉం డా ల్సి ఉంటే కేవలం 10.58 శాతం మాత్రమే ఉన్నా యి. అడవుల శాతం రోజురోజుకు తగ్గిపోతూ ఉంటే వర్షాలు సైతం అదేస్థాయిలో ముఖంచాటేస్తున్నా యి. ఈ తరుణంలో అన్నదాత ఆగమవుతున్నాడు. పశు పక్షాదులు తాగేందుకు కనీసం నీరు దొరకని పరిస్థితి ఎదురవుతుంది. ఈ నెల 11న సీఎంతో కలెక్టర్ల సమావేశంలో చెట్లు నరికివేత అంశంపైన చర్చ జరిగింది. అడవులు తగ్గిపోతున్నాయనే ఆందోళన కనిపిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఓ వైపు హరితహారం ద్వారా మొక్కలు నాటి సంరక్షిస్తుంటే, మరోవైపు చెట్లను ఇష్టానుసారం నరుక్కుంటూ పోతే ఇక అడవుల శాతం ఎలా పెరుగుతుందనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రస్తుతం ఉన్న 10.58 శాతాన్ని 33 శాతం చేసేందుకు అటవేతర ప్రాంతాల్లోనూ హరితహారం కార్యక్రమం ద్వారా అడవులను తయారు చేసే ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఓ వైపు హరితహారం మొక్కలను కాపాడుకుంటూనే మరోవైపు చెట్ల నరికివేతకు బ్రేకులు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు గతంలోనే ఉన్న జిల్లా ఫారెస్ట్‌ ప్రొటెక్ట్‌ కమిటీని తిరిగి పునరుద్ధరించారు. మ రోవైపు అటవీ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాల ను సమన్వయపరిచేందుకు వారితో సమావేశాలు ఏర్పా టు చేశారు. చెట్ల నరికితే ఒక్క అటవీ శాఖే కాకుండా అందరూ స్పందింటాలని ఆదేశాలు జారీ చేశారు.

అక్రమ ఇసుకాసురులపై ఉక్కుపాదం..

జిల్లాలో కాసుల గలగల కురిపించే అక్రమ దం దాల్లో ఇసుక ప్రధానమైనది. జిల్లాలో ఉన్న సారవంతమైన వాగుల పరిధిలో ఇసుక అక్రమ రవాణా మూడుపూలు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. పగటి పూట అధికారులు పట్టుకుంటారనే భయంతో రాత్రిళ్లు అక్రమ దందా కొనసాగిస్తున్నా రు. కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది సాయంతో ఇసుక అక్రమదందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ అక్రమ దందాకు చెక్‌ చె ప్పేందుకు జిల్లా పాలకవర్గం సిద్ధమైంది. వాగులు, వంకల్లో ఉన్న ఇసుకను అక్రమంగా తరలించుకుపోవడంతో భూ గర్భ జలాలు అడుగంటి బోర్లు పనిచేయని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్రమ ఇసుక దందాపైనా కలెక్టర్‌ వెంకట్రావు వాల్టా చట్టం ప్రయోగిస్తామని ప్రకటించారు. ఇసుక రవాణా చే స్తున్న వారిపై సా ధారణ జరిమానాలు కాకుండా, ఈ దందా చేసేందుకే భయపడేలా భారీ ఎత్తున జరిమానాలు వేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 


logo