న్యూఢిల్లీ: భారత యువ బాక్సర్
లాల్రిన్సంగా త్లౌ.. డబ్ల్యూబీసీ వరల్డ్ యూత్ సూపర్ ఫెదర్ వెయిట్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన తుదిపోరులో 21 ఏండ్ల లాల్రిన్సంగా ఘన బాక్సర్ ఎరిక్ ఖుర్మ్పై విజయం సాధించాడు. ప్రపంచ బాక్సింగ్ మండలి (డబ్ల్యూబీసీ) అనుమతితో భారత బాక్సింగ్ మండలి పర్యవేక్షణలో ఐజ్వాల్ వేదికగా జరిగిన టోర్నీలో మిజోరాం బాక్సర్ దుమ్మురేపాడు.