శుక్రవారం 29 మే 2020
Mahabubnagar - Jan 31, 2020 , 02:12:15

నిరుపేదలకు అండగా ప్రభుత్వం

నిరుపేదలకు అండగా ప్రభుత్వం

దేవరకద్ర, నమస్తే తెలంగాణ : నిరుపేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మండ లంలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి వచ్చిన చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మండలంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన చెన్నమ్మకు రూ. 20 వేలు, గోపన్‌పల్లికు చెందిన పద్మమ్మకు రూ.33,500, బస్వాయి పల్లికు చెందిన నరేశ్‌కు రూ.14 వేలు, ఇస్రంపల్లికి చెందిన పద్మమ్మకు రూ.11,500 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 


ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ రమా శ్రీకాంత్‌ యాదవ్‌, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్‌ ఎంపీపీ తుమల సుజాత, ఆలయ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ కొండా విజయలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ ఈవి గోపాల్‌, మాజీ జెడ్పీటీసీ లక్ష్మికాంత్‌రెడ్డి, మండల కో-ఆఫ్షన్‌ యండీ ఖదీర్‌, నాయకులు కర్ణం రాజు, కొండ శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతయ్య, బాలస్వామి, వెంకట్రాములు, శివారాజ్‌, కొండా రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, వెంకటేశ్‌, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.


logo