e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021

జల సవ్వడి

  • జూరాలకు మళ్లీ వరద ప్రారంభం
  • నిండిన ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు
  • ఎత్తిపోతలకు కొనసాగుతున్న పంపింగ్‌
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు
  • సాగుకు ఆశాజనకంగా పరిస్థితులు

మహబూబ్‌నగర్‌, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ ర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు సైతం ఎగువ నుంచి వ రదలు ఆశాజనకంగా వస్తున్నది. ఎగువ న ఉన్న అన్ని ప్రాజెక్టులు దాదాపుగా నిండుకుండలను తలపిస్తుండడంతో జూరాల, శ్రీశైలానికి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు కృష్ణా పరీవాహక ప్రాం తంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండడంతో ప్రాజెక్టులకు వరద వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఆల్మట్టి ప్రాజెక్టు 95.22 టీఎంసీలతో కళకళలాడుతున్నది. నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సా మర్థ్యానికి చేరుకుంటున్నది. రెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండే అవకాశం కనిపించడంతో ఎగువ నుంచి జూరాల, శ్రీశైలానికి భారీ వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎగువ నుంచి పెరగుతున్న వరద..
గత నెలలో నారాయణపూర్‌ ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కారణంగా దిగువకు నీటిని విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టు పరిధిలోని అన్ని ఎత్తిపోతలకు నీటి విడుదల కొనసాగింది. దీంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని కాలువలకు నీటి విడుదల సైతం ప్రారంభమైంది. విద్యుదుత్పత్తి సైతం చేపడుతున్నారు. కేవలం 24 రోజుల్లో 57 మిలియన్‌ యూ నిట్ల ఉత్పత్తి సాధ్యమైంది. గతంలో జూన్‌లో ఈ స్థాయి లో విద్యుదుత్పత్తి, నీటి విడుదల జరగలేదు. మరోవైపు ముందస్తుగా నీటి విడుదలతో రైతులు సంతోషంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జూరాల ప్రాజెక్టు నుం చి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌ సాగర్‌, జూరాల కుడి, ఎడు మ కాలువలకు నీటి విడుదల చేపట్టారు. చెరువులు సైతం నింపారు. దీంతో నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ ల్మట్టి పూర్తి నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ఇ ప్పటికే 95.22 టీఎంసీలకు చేరుకున్నది. నారాయణపూర్‌ పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 34. 78 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువ నుంచి వరద వస్తుందనే ఉద్దేశంతో జూరాల ప్రాజెక్టుకు వచ్చిన వరదను అటు విద్యుత్‌, ఇటు సాగునీటికి వినియోగిస్తున్నారు. దీంతో జూ రాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. బుధవారం సాయంత్రం నాటికి 5.92 టీఎంసీల నీటి మ ట్టానికి చేరుకున్నది. ఇక కృష్ణా ఉపనది అయిన భీమానదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 117.24 టీ ఎంసీలు కాగా.. ప్రస్తుతం 60.06 టీఎంసీలు ఉన్నది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 36.37 టీఎంసీలకు చేరుకున్నది. దాదాపుగా గతేడాదిలాగే ఈసారి కూడా ప్రాజెక్టులకు జలకళ కనిపిస్తున్నది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న తరుణంలో ఈ ఏడాది కూడా ఆ శాజనకంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana